Site icon NTV Telugu

King Cobra: ఎవరెస్ట్ శిఖరానికి సమీపంలో ‘‘కింగ్ కోబ్రా’’ పాములు.. శాస్త్రవేత్తల్లో కలవరం..

King Cobra

King Cobra

King Cobra: హిమాలయాలు, ముఖ్యంగా ఎవరెస్ట్ పర్వతాలకు సమీపంలో విషపూరిత పాములు కనిపించడం శాస్త్రవేత్తల్ని కలవరపరుస్తోంది. నేపాల్ లోని ఎవరెస్ట్ శిఖరం సమీపంలో ఒకటిన్నర నెలల వ్యవధిలో 10 విషపూరిత పాములు, ఇందులో 09 కింగ్ కోబ్రా పాములను పట్టుకున్నారు. ఇలా అత్యంత శీతల ప్రాంతంలో కింగ్ కోబ్రా పాములు కనిపించడంపై సైంటిస్టులు ఆందోళన చెందుతున్నారు. ఈ పాములను నాలుగు వేర్వేరు ప్రాంతాలు గోపాలేశ్వర్, భంజ్యాంగ్, సోఖోల్, ఫుల్‌చౌక్ ప్రాంతాల నుండి- రక్షించినట్లు దక్షిణ్ కాళి మునిసిపాలిటీ అధికారులు వెల్లడించారు.

కింగ్ కోబ్రా ప్రపంచంలోనే అతి పొడవైన విషపూరిత పాము. గూడును నిర్మించుకునే ఈ పాము లక్షణం, దీనిని ఇతర పాముల నుంచి వేరు చేస్తుంది. దీని విషం అత్యంత శక్తివంతమైంది. ఒక్క కాటులో విడుదల చేసే విషంతో ఏకంగా 20 మందిని లేదా పెద్ద ఏనుగును చంపేంత శక్తి ఉంటుంది.

Read Also: Gangster Goldy Brar: “సిద్ధూ మూసే వాలా” హత్యకు కారణాలు వెల్లడించిన గ్యాంగ్‌స్టర్..

కింగ్ కోబ్రాస్ మరియు మోనోక్లెడ్ ​​కోబ్రాస్, రెండూ పాములు, దక్షిణ నేపాల్, ఉత్తర భారతదేశంలోని తారై రీజియన్‌లో ఎక్కువగా కనిపిస్తాయి. ఉష్ణోగ్రత పెరుగుతూ ఉండటంతో, ఇవి ఇప్పుడు కొండ, పర్వత ప్రాంతాల్లో గూళ్లు కట్టుకుని కనిపిస్తు్న్నాయి. శీతల ప్రాంతంలో ఈ పాములు ఉండటం వాతావరణ మార్పుల వల్ల కావచ్చని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారనంగా ఈ ఉష్ణమండల పాములు చల్లని ప్రాంతాలకు వెళ్తున్నాయని నిపుణులు భావిస్తున్నారు. ఈ మార్పు ఇలాగే కొనసాగితే, అతి ఈ ప్రాంత పర్యావరణ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపనుంది.

గత కొన్ని ఏళ్లుగా నేపాల్ వాతావరణ మార్పులను చూస్తోంది. నేపాల్ గరిష్ట ఉష్ణోగ్రత ఏడాదికి 0.05 డిగ్రీ సెల్సియన్ చొప్పున పెరుగుతోంది. నివాస విధ్వంసం, మానవ సంఘర్షణ, పాము కాట్లు కింగ్ కోబ్రాలకు గణనీయ ముప్పుని కలిగిస్తున్నాయి. ముఖ అంతర్జాతీయ వైద్య పత్రిక అయిన ది లాన్సెట్‌లో మార్చి 2022లో ప్రచురించబడిన ఒక నివేదికలో వేసవిలో తరై జిల్లాల్లో పాముకాటు ఫలితంగా మరణాలు సర్వసాధారణమని హైలైట్ చేసింది. ప్రతి సంవత్సరం, నేపాల్‌లోని తరై ప్రాంతానికి చెందిన దాదాపు 2,700 మంది, ఎక్కువగా పిల్లలు మరియు మహిళలు, పాముకాటు కారణంగా ప్రాణాలు కోల్పోతున్నారు.

Exit mobile version