Kim Jong Un: ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. తమను తాము రక్షించుకోవడానికి ముందస్తు అణు దాడులకు వెనకాడం అని హెచ్చరించారు. తమను తాము రక్షించుకునే హక్కు ఉందని ఆయన అన్నారు. తమ అణ్వాస్త్ర సామర్థ్యం తిరగులేనిదని కిమ్ అన్నారు. అమెరికా చర్యలను అడ్డుకోవాలంటే అణ్వాయుధాలు ఉండాల్సిందే అని గురువారం ఉత్తర కొరియా సుప్రీం పీపుల్స్ అసెంబ్లీలో ప్రసగించారు. అమెరికా, దక్షిణ కొరియా కలిసి తమ ప్రభుత్వాన్ని పడగొట్టాలని ప్రయత్నిస్తున్నాయని కిమ్ ఆరోపించారు.
2017 తర్వాత మళ్లీ ఉత్తర కొరియా అణు పరీక్షలకు సిద్ధం అవుతుందనే వార్తల నేపథ్యంలో కిమ్ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకున్నాయి. 2018లో అప్పటి యూఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్, కిమ్ మధ్య కీలక చర్చలు జరిగాయి. ఇందులో ప్రధానంగా ఉత్తర కొరియా అణ్వాయుధాలను విడిచిపెట్టాలనే అంశం ప్రముఖంగా ప్రస్తావనకు వచ్చింది. అయితే ఈ చర్చలు విఫలం అయ్యాయి. ఇదిలా ఉంటే గురువారం సమావేశం అయిన ఉత్తర కొరియా సుప్రీం పీపుల్స్ అసెంబ్లీ.. 2013 నాటి అణ్వాయుధ చట్టానికి ప్రత్యామ్నాయంగా మరో చట్టాన్ని ఆమోదించింది.
Read Also: School Bus Fire: స్కూలు బస్ లో మంటలు.. సురక్షితంగా బయటపడ్డ విద్యార్ధులు
ఈ చట్టం ద్వారా.. దేశ భద్రతకు ముప్పు ఏర్పడినప్పుడు అణ్వాయుధాలతో ప్రతిస్పందించే అధికారాన్ని సైన్యానికి కల్పించింది. ఈ అణ్వాయుధాల విధానాన్ని చట్టబద్ధం చేయడం అంటే.. మన అణ్వాయుధాలపై బేరసారాలు జరగకుండా చేయడమే అని కిమ్ అన్నారు. మరో వందేళ్లు ఉత్తర కొరియాపై ఆంక్షలు పెట్టినా.. అణ్వాయుధాల విషయంలో లొంగిపోయేది లేదని చెప్పారు. ఇటీవల కాలంలో వరసగా క్షిపణుల ప్రయోగాల చేపడుతోంది ఉత్తర కొరియా. గత కొన్ని నెలలుగా కోవిడ్ తో బాధపడుతున్న ఆ దేశం ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. ఉత్తర కొరియాలో కోరోనాకు కారణం దక్షిణ కొరియానే అని ఉత్తర కొరియా ఆరోపిస్తోంది.