Site icon NTV Telugu

Haryana: హర్యానాలో మరో ఘోరం.. వైద్యురాలిపై సీనియర్ వైద్యుడు దాడి

Student

Student

కోల్‌కతా వైద్యురాలి హత్యాచార ఘటనను మరువక ముందే హర్యానాలో మరో ఘటన చోటుచేసుకుంది. కోల్‌కతా ఘటన జరిగిన కొన్ని రోజులకే రోహ్‌తక్‌లో మరో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. బీడీఎస్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థినిపై సీనియర్ వైద్యుడు దాడికి పాల్పడ్డాడు. అంతేకాకుండా కిడ్నాప్ చేశాడు. ఆగస్ట్ 16, 17 తేదీల్లో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆదివారం PGIMS డైరెక్టర్ జారీ చేసిన సర్క్యులర్‌తో నిందితుడు కౌశిక్‌ను అరెస్టు చేశారు.

ఇది కూడా చదవండి: YS Jagan: విదేశాలకు వెళ్లేందుకు అనుమతి కోరుతూ జగన్, విజయసాయిరెడ్డి పిటిషన్లు

బాధితురాలు సోషల్ మీడియా ద్వారా తన గోడును వెళ్లబుచ్చుకుంది. శరీరమంతా గాయాలతో కన్నీళ్లు పెట్టుకుంది. కౌశిక్ తనను ప్రేమించాలని, సంబంధం పెట్టుకోవాలని బలవంతం చేశాడని వాపోయింది. వ్యతిరేకించినందుకు దాడి చేశాడని తెలిపింది. శారీరకంగా, మానసికంగా వేధించాడని బాధితురాలు తల్లడిల్లింది. ఇక నిందితుడిపై యాజమాన్యం కఠిన చర్యలు తీసుకుంది. నిందితుడ్ని అరెస్ట్ చేయించడమే కాకుండా.. క్యాంపస్‌ను బహిష్కరించింది.

ఇది కూడా చదవండి: Kolkata doctor case: మీడియాను చూసి పరుగులు పెట్టిన నిందితుడు సంజయ్ రాయ్ సన్నిహితుడు

Exit mobile version