NTV Telugu Site icon

Khalistani Terrorist: భారత్‌కి మద్దతు ఇచ్చాడని.. న్యూజిలాండ్ ఉప ప్రధానికి ఖలిస్తాన్ టెర్రరిస్టు పన్నూ బెదిరింపులు..

Khalistani Terrorist

Khalistani Terrorist

Khalistani Terrorist: ఖలిస్తాన్ టెర్రిరిస్ట్, సిఖ్ ఫర్ జస్టిస్(ఎస్‌జేఎఫ్) సంస్థ చీఫ్ గురుపత్వంత్ సింగ్ పన్నూ మరోసారి బెదిరింపులకు పాల్పడ్డాడు. భారత్‌కి మద్దతుగా మాట్లాడినందుకు న్యూజిలాండ్ ఉప ప్రధాని విన్‌స్టన్ పీటర్స్‌ని బెదిరించాడు. కెనడాలో ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారత ప్రమేయం ఉందనే దానికి సరైన ఆధారాలు లేవని విన్‌స్టన్ పీటర్స్ అన్నారు. నిజ్జర్ హత్యలో కెనడా భారత ప్రమేయం ఉన్నట్లు సరైన ఆధారాలు ఇవ్వలేదని పీటర్స్ పేర్కొన్నారు.

అయితే, ఈ వ్యాఖ్యలతో ఖలిస్తాన్ టెర్రరిస్ట్ పన్నూ అసంతృప్తి వ్యక్తం చేశాడు. న్యూజిలాండ్‌లోని భారత దౌత్యవేత్తలపై దాడి చేస్తానని బెదిరించాడు. గత నెలలో ఇలాగే కెనడాలోని భారత దౌత్యవేత్తలపై హింసాత్మక దాడులు చేస్తానంటూ ఓ పోస్టర్ రిలీజ్ చేశాడు.

Read Also: Bombay High Court: అర్ధరాత్రి నిమ్మకాయ కోసం మహిళ ఇంటి తలుపు తట్టడం అధికారికి తగునా..?

గతేడాది కెనడాలోని సర్రే ప్రాంతలో హర్దీప్ సింగ్ నిజ్జర్‌ని గుర్తుతెలియని వ్యక్తుల కాల్చి చంపారు. అయితే, ఈ హత్యలో భారత ప్రభుత్వ ఏజెంట్ల ప్రమేయం ఉందని ఆ దేశ ప్రధాని జస్టిన్ ట్రూడో వ్యాఖ్యానించాడు. కెనడా తప్పుడు ఆరోపణలు, అసంబద్ధ, రాజకీయ ప్రేరేపిత ఆరోపణలు చేస్తోందని భారత్ తప్పుపట్టింది. ఈ వివాదం రెండు దేశాల మధ్య దౌత్యవివాదానికి దారి తీసింది. కెనడా ఈ కేసులో సమాచారాన్ని ‘ఐవ్ ఐస్’ దేశాలతో(అమెరికా, న్యూజిలాండ్, యూకే, కెనడా, ఆస్ట్రేలియా)తో పంచుకున్నట్లు వెల్లడించింది.

ఇదిలా ఉంటే మిత్రపక్షంగా ఉన్న న్యూజిలాండ్ దేశ ఉపప్రధాని ఈ కేసులో భారత్‌కి వ్యతిరేకంగా కెనడా ఎలాంటి సాక్ష్యాలు ఇవ్వలేదని పేర్కొనడంతో కెనడా స్వరూపం బయటపడింది. ఈ పరిణామాలు ఖలిస్తానీ ఉగ్రవాదులకు నచ్చడం లేదు. అమెరికా-కెనడా ద్వంద్వ పౌరసత్వం కలిగిన గురుపత్వంత్ సింగ్ పన్నూ న్యూజిలాండ్‌ని భయపెట్టే విధంగా వ్యాఖ్యలు చేశాడు.