Khalistani Terrorist: భారతదేశంలో గత కొన్ని రోజులుగా విమానాలకు వరుసగా బాంబు బెదిరింపులు వస్తున్నాయి. ఈ పరిణామాల వేళ ఖలిస్థానీ వేర్పాటువాది గుర్‌పత్వంత్ సింగ్ పన్నూన్.. ‘ఎయిర్ ఇండియా’కు వార్నింగ్ ఇవ్వడం తీవ్ర కలకలం రేపుతుంది. నవంబరు 1 నుంచి 19వ తేదీల మధ్యలో ఎయిర్ ఇండియా ఫ్లైట్ లో ప్రయాణించొద్దని అతడు హెచ్చరికలు జారీ చేశాడు. ఇక, భారత్‌లో సిక్కు వ్యతిరేక అల్లర్లు జరిగి 40 ఏళ్లు కావొస్తున్న సందర్భంగా ఎయిర్ ఇండియా విమానాలపై దాడి జరిగే ఛాన్స్ ఉందని పన్నూన్ తెలిపారు. అందులో ఆయా తేదీల్లో ఆ సంస్థ విమానాల్లో ప్రయాణించొద్దని ఓ వీడియోను విడుదల చేశాడు. కాగా, పన్నూన్ ఇలాంటి వార్నింగ్ చేయడం ఇది తొలిసారి కాదు.
Read Also: CM Revanth Reddy: మతోన్మాద శక్తులపై ఉక్కు పాదం మోపుతాం.. సికింద్రాబాద్ ఆలయ ఘటనపై సీఎం సీరియస్
అయితే, గత నవంబరులోనూ ఇలాంటి ఓ వీడియోను రిలీజ్ చేశాడు. నవంబరు 19న ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ఆ రోజు మూతపడుతుందని.. ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం పేరు కూడా మార్చేస్తామని గతేడాది అతడు ఆ వీడియోలో వెల్లడించారు. కాగా, సిఖ్స్ ఫర్ జస్టిస్ (SFJ) అనే వేర్పాటువాద సంస్థను 2007లో గురపత్వంత్ సింగ్ పన్నూన్ స్థాపించాడు. ఈ సంస్థను భారత్ 2019లోనే నిషేధించింది. చట్టవ్యతిరేక కార్యకలాపాల చట్టం (UAPA) కింద కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అతడిని 2020 జులైలో ఉగ్రవాదిగా ప్రకటించింది. ప్రస్తుతం అతడు అమెరికాలో ఉన్నట్లు తెలుస్తుంది. పన్నూన్ కు అగ్రరాజ్యంతో పాటు కెనడా పౌరసత్వం ఉంది.