Site icon NTV Telugu

Justin Trudeau: ఖలిస్తానీ వేర్పాటువాదులపై కీలక వ్యాఖ్యలు చేసిన ట్రూడో..

Justin Trudeau

Justin Trudeau

Justin Trudeau: ఖలిస్తానీ వేర్పాటువాదులకు మద్దతు ఇస్తూ వస్తున్న కెనడా ప్రధాని జస్టిన్ ట్యూడో కీలక వ్యాఖ్యలు చేశారు. దీపావళి, బండి చోర్ దివాస్‌ని పురస్కరించుకుని ఒట్టావాలోని పార్లమెంట్ హిల్‌లో సోమవారం జరిగిన కార్యక్రమంలో జస్టిన్ ట్రూడ్ ఈ వ్యాఖ్యల్ని చేశాడు. ‘‘కెనడాలోని సిక్కు సమాజానికి ఖలిస్తానీ వేర్పాటువాదులు ప్రాతినిధ్యం వహించడం లేదు’’ అని చెప్పాడు. ఇలా కెనడా ప్రధాని పేర్కొనడం ఇదే తొలిసారి.

Read Also: Daggubati Purandeswari: సిడ్నీలో తెలుగు ప్రజలతో సమావేశం కావడం సంతోషదాయకం..

కెనడా ప్రధాని హాజరైన ఈ సమావేశాన్ని కేబినెట్ మంత్రులు అనితా ఆనంద్, గ్యారీఆనందసంగరీ నిర్వహించారు. కెనడాలో ఖలిస్తాన్‌కి చాలా మంది మద్దతుదారులు ఉన్నారు, కానీ వారు మొత్తం సిక్కు సమాజానికి ప్రాతినిధ్యం వహించరని ట్రూడో చెప్పాడు. బ్రాంప్టన్‌లో హిందూ సభ మందిర్‌పై ఖలిస్తాన్ అనుకూల వేర్పాటువాదులు హింసాత్మక దాడి చేసిన ఒక రోజు తర్వాత సోమవారం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. హింస, అసహనం, బెదిరింపులకు కెనడాలో తావులేదని అన్నారు.

‘‘ప్రజలు వారి సంస్కృతులను పాటించడాన్ని ప్రోత్సహిస్తుంటాము, సవాలు ఏంటేంటే, ఆ విభిన్న అభిప్రయాలున్నప్పటికీ మనల్ని విభజించే వారిని ఎప్పటికీ అనుమతించకూడదు’’ అని ట్రూడో అన్నాడు. తమ ప్రభుత్వం ‘‘వన్ ఇండియా’’ దేశ సమగ్రత కోసం నిలుస్తుందని చెప్పారు. ప్రధాని మోడీ గురించి మాట్లాడుతూ.. ప్రధాని మోడీ ప్రభుత్వానికి చాలా మంది మద్దతుదారులు కెనడాలో ఉన్నారని, వారు మొత్తం హిందూ కెనడియన్లకు ప్రాతినిధ్యం వహించరని అన్నారు.

Exit mobile version