khaki Ganpati In Mumbai: వినాయక చవితి వేడుకల్లో వివిధ రుపాల్లో గణనాథుడు కొలువవుతున్నాడు. భక్తులు తమకు నచ్చిన స్టైల్‌లో వినాయకులను ప్రతిష్టించారు. ఇటీవల పుష్ఫ రాజ్ తరహాలో తగ్గేదే లేదనే స్టైల్‌లో వినాయక విగ్రహాన్ని ప్రతిష్టించడం చూశాం. తాజాగా ముంబై పోలీసులు వినూత్న ఆలోచన చేశారు. ఓ వైపు భక్తితో పాటు ప్రజలకు సందేశాన్ని ఇచ్చే విధంగా ‘‘ ఖాకీ గణపతి’’ని ప్రతిష్టించారు.
మహరాష్ట్రలోని విలేపార్లే పోలీస్ స్టేషన్ లో గణేష్ చతుర్థి వేడుకల్లో భాగంగా ఢిపరెంట్ స్టైల్‌లో గణేషుడు కొలువుదీరాడు. అచ్చంగా పోలీస్ తరహాలో ఖాకీ చొక్కా, చేతిలో మొబైల్ ఫోన్ ఇలా సరికొత్త గణపతిని ప్రతిష్టించారు. ఈ పోలీస్ బప్పాను సైబర్ మోసాలకు వ్యతిరేకంగా అవగాహన కల్పించేందుకు ఒక సందేశం ఇచ్చేలా పోలీసులు ఏర్పాటు చేశారు. పోలీసుల ప్రయత్నాలను మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ అభినందించారు.
Read Also: Chinmayi Sripada: సమంతతో నా ప్రయాణం ముగిసింది.. విభేదాలపై క్లారిటీ
ఇన్‌స్పెక్టర్ రాజేంద్ర కేన్ మాట్లాడుతూ.. సైబర్ ట్రాప్ లో పడకుండా సామాన్యుల్లో వినూత్న రీతిలో అవగాహన కల్పించేందుకు ఈ గణేషుడిని డిజైన్ చేసినట్లు వెల్లడించారు. పోలీసులే ప్రతీది చేయాలని నమ్మే ప్రజలు ఉన్న ఈ సమాజంలో.. ప్రజలకు అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈ గణనాథుడిని ఏర్పాటు చేశామని ఆయన అన్నారు. సైబర్ నేరాలు పెరుగుతున్నాయని.. ఎక్కువ మంది వీటి బారిన పడుతున్నారని.. ప్రజలు కష్టపడి సంపాదించిన డబ్బుతో మోసగాళ్లు ఎందుకు ప్రయోజనం పొందాలని ప్రశ్నించారు. అందుకే ప్రజల్లో అవగాహన పెంచాలని అనుకున్నామని తెలిపారు.
2017 నుంచి ఇన్‌స్పెక్టర్ రాజేంద్ర కేన్ యూనిఫాం ధరించిన గణేశుడిని ఉపయోగించి దొంగతనం, చైన్ స్నాచింగ్, ట్రాఫిక్ ఉల్లంఘనల వంటి నేరాల బారిన పడకుండా ఎలా జాగ్రత్త వహించాలో ప్రజలకు తెలియజేసేలా గణేషుడిని ఏర్పాటు చేస్తున్నారు. ఈ సారి సైబర్ నేరాల నుంచి ప్రజల్ని అప్రమత్తం చేసేలా గణనాథుడు కొలువుదీరాడు.
