Pahalgam Attack: 26 మందిని చంపాక 4 రౌండ్లు గాల్లోకి కాల్పులు.. ముష్కరులు ఇలా ఎందుకు చేశారంటే..!
- పహల్గామ్ ఉగ్ర దాడిపై కీలక అప్డేట్
- 26 మందిని చంపాక 4 రౌండ్లు గాల్లోకి ముష్కరులు కాల్పులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పహల్గామ్ ఉగ్ర దాడి యావత్తు దేశాన్ని కాకుండా ప్రపంచాన్ని కలవరపాటుకు చేసింది. నలుగురు ముష్కరులు తుపాకులతో చెలరేగిపోయారు. మహిళలు, పిల్లల్ని వదిలేసి భర్తలను చంపేశారు. ఇలా 26 మందిని ఉగ్రవాదులు పొట్టనపెట్టుకున్నారు. ఇక ఈ కేసును ఎన్ఐఏ దర్యాప్తు చేస్తోంది. దర్యాప్తులో భాగంగా ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించిన స్థానికులను అరెస్ట్ చేశారు. అలాగే సంఘటనాస్థలిలో ఉన్న ప్రత్యక్ష సాక్ష్యులను అధికారులు విచారించారు.
అయితే పహల్గామ్లో ఉగ్రవాదులు తమ పని పూర్తి చేశాక.. సంతోషంతో గాల్లోకి నాలుగు రౌండ్లు కాల్పులు జరిపారని ప్రత్యక్ష సాక్షి ఒకరు అధికారులకు వెల్లడించాడు. ఆ దృశ్యాలను ప్రత్యక్షంగా చూసినట్లుగా పేర్కొన్నాడు.
Also Read
- Fake Certificate: గాడిద పేరు మీద నర్సింగ్ సర్టిఫికేట్.. పేరు ‘డంకీ’.. తండ్రి ‘డంకీ ఫాదర్’.. కులం ‘యానిమల్’..
- Road Tax vs Toll Tax: ఒకే కారుకు రెండు పన్నులా? రోడ్ ట్యాక్స్, టోల్ ట్యాక్స్ మధ్య అసలు తేడా ఏంటి..?
- CJP: ‘‘శివాజీ పార్క్‌లో అడుగుపెట్టనివ్వం’’.. సీజేపీకి ముంబై స్థానికుల ఝలక్!
- Jammu Kashmir: CISF క్యాంపులో కలకలం..హెడ్ కానిస్టేబుల్ కాల్పుల్లో నలుగురు జవాన్లు మృతి
ఇది కూడా చదవండి: Hyderabad: మలక్‌పేట్ కాల్పులపై కొనసాగుతున్న దర్యాప్తు.. నిందితులు ఏం చేశారంటే..!
ఇక ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించిన ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు. బాట్కోట్ నుంచి పర్వైజ్ అహ్మద్ జోథర్, హిల్ పార్కు నుంచి బషీర్ అహ్మద్ జోథర్‌గా గుర్తించారు. బాట్కోట్, హిల్ పార్క్ రెండు ప్రాంతాలు కూడా పహల్గామ్లోనే ఉన్నాయి. విచారణలో ముగ్గురు ఉగ్రవాదుల వివరాలను వెల్లడించారు. ఉగ్రవాదులు… లష్కరే తోయిబా (LeT)తో అనుబంధంగా ఉన్న పాకిస్థాన్ పౌరులుగా నిర్ధారించారు. హిల్ పార్కులోని ఒక గుడిసెలో ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించారు. ఆహారం, లాజిస్టికల్ మద్దతు అందించారు. ఇక పర్వైజ్, బషీర్‌ను చట్టవిరుద్ధ కార్యకలాపాల (నివారణ) చట్టం, 1967లోని సెక్షన్ 19 కింద అరెస్టు చేశారు. ఈ కేసులో తదుపరి దర్యాప్తు కొనసాగుతోందని దర్యాప్తు అధికారి మీడియాకు తెలిపారు.
ఇది కూడా చదవండి: Fauja Singh: కారు ఢీకొని ప్రముఖ అథ్లెట్ ఫౌజా సింగ్ మృతి.. నిందితుడు ఎన్నారై అరెస్ట్
ఇక ప్రత్యక్ష సాక్షి దర్యాప్తు సంస్థతో కీలక విషయాలు పంచుకున్నాడు. 26 మందిని చంపిన తర్వాత ముగ్గురు ఉగ్రవాదులు వెళ్లిపోతుండగా తనను ఆపారని చెప్పాడు. కల్మా పఠించమని అడిగారని.. తాను స్థానిక యాసలో మాట్లాడడంతో తనను విడిచిపెట్టేశారని పేర్కొన్నాడు. అనంతరం సంతోషంగా నాలుగు రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపారని చెప్పుకొచ్చాడు. ఇక పర్వైజ్, బషీర్ కొండ దగ్గర నిలబడి.. ఉగ్రవాదుల వస్తువులను చూసుకున్నారని వెల్లడించాడు. కాల్పులు అయిపోయాక.. ముష్కరులు వస్తువులు తీసుకుని వెళ్లిపోయారని పేర్కొన్నాడు.
ఏప్రిల్ 22న పహల్గామ్లో పర్యాటకుల్ని లక్ష్యంగా చేసుకుని ముష్కరులు దాడి చేశారు. మతం ఆధారంగా దాడి చేశారు. ముస్లిం వ్యతిరేకులను 26 మందిని చంపేశారు. అయితే ఈ దాడిలో నలుగురు ఉగ్రవాదులు పాల్గొన్నట్లు అధికారులు అంచనా వేస్తు్న్నారు. ముగ్గురు పాకిస్థానీలు హషీమ్ ముసా అలియాస్ సులేమాన్, అలీ భాయ్ అలియాస్ తల్హా భాయ్, ఆసిఫ్ ఫౌజీ, అనంతనాగ్ నివాసి అయిన స్థానిక ఉగ్రవాది అబిద్ హుస్సేన్ థోకర్ సహా నలుగురు ఉగ్రవాదుల ప్రమేయం ఉందని భద్రతా దళాలు అనుమానిస్తున్నాయి.
ఇక పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా మే 7న పాకిస్థాన్‌పై భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. దీంతో 100 మంది ఉగ్రవాదులు హతం అయ్యారు. అలాగే పాకిస్థాన్ వైమానిక స్థావరాలు దెబ్బతిన్నాయి.
తాజావార్తలు
-
Sreeleela : శ్రీలీల బాలీవుడ్ తెరంగేట్రానికి ముహుర్తం ఎప్పుడు..?
-
Fake Certificate: గాడిద పేరు మీద నర్సింగ్ సర్టిఫికేట్.. పేరు ‘డంకీ’.. తండ్రి ‘డంకీ ఫాదర్’.. కులం ‘యానిమల్’..
-
Raashi Khanna : లీక్స్‌లో చిరంజీవినే మించిపోయింది రాశీ ఖన్నా
-
India vs West Indies 2nd ODI: సిరీస్ గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్.. సిరాజ్ రీఎంట్రీ.? ప్లేయింగ్ XI ఇలా..!
-
Road Tax vs Toll Tax: ఒకే కారుకు రెండు పన్నులా? రోడ్ ట్యాక్స్, టోల్ ట్యాక్స్ మధ్య అసలు తేడా ఏంటి..?
ట్రెండింగ్
-
2K+ 165Hz AMOLED డిస్ప్లే, 50MP+50MP+32MP కెమెరాలు, 8,400mAh బ్యాటరీతో iQOO 16 5Gలాంచ్.. ధర ఎంతంటే.?
-
World Heart Day : గుండె జబ్బు వచ్చే ముందు ఈ చిన్న సంకేతాలు కనిపిస్తాయా.?
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!