Site icon NTV Telugu

కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు..

prakash javadekar

prakash javadekar

ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్‌ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ‍్యంగా ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ రెండు రోజుల క్రితం ప్రకటించిన ఉద్దీపన ప్యాకేజీకి కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ఇందులో భాగంగా 1.22 లక్షల కోట్ల రూపాయల ఎగుమతి బీమా పరిధిని కేబినెట్ ఆమోదించినట్లు కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ ప్రకటించారు. అలాగే, 3.03 లక్షల కోట్ల రూపాయల విలువైన సంస్కరణ-ఆధారిత, ఫలిత-అనుసంధాన పవర్ డిస్కం పథకానికి కూడా కేబినెట్ ఆమోదించిందన్నారు. దేశంలోని అన్ని గ్రామాలకు ఇంటర్నెట్ సదుపాయం కల్పించాలని కూడా కేంద్ర కేబినెట్‌ నిర్ణయించింది. 16 రాష్ట్రాల్లోని గ్రామాల్లో బ్రాడ్‌బ్యాండ్ సేవలకు భరత్‌నెట్ ప్రాజెక్టును ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్య మోడ్ కింద 19వేల 41 కోట్లతో సాధ్యమయ్యే గ్యాప్ నిధులతో కేబినెట్ ఆమోదించినట్లు టెలికాం మంత్రి రవిశంకర్ ప్రసాద్ ప్రకటించారు.

Exit mobile version