Ketan Agarwal murder case: 3 ఏళ్ల టైమ్ దొరుకుతుందనే కేతన్ హత్య..

  • పెళ్లి రద్దు కోసమే హత్య..
  • మూడేళ్లు సమయం దొరుకుతుందని ప్లాన్..
  • కుటుంబానికి చెప్పడం కన్నా హత్య చేయడమే ఈజీ..
  • కేతన్ హత్య కేసులో సంచలన విషయాలు వెల్లడించిన సియా..
Ketan Agarwal Case

Ketan Agarwal Case

Ketan Agarwal murder case: పూణేలో సంచలనం సృష్టించిన కేతన్ అగర్వాల్ హత్య కేసులో రోజుకో సంచలన విషయం వెలుగులోకి వస్తోంది. హత్య చేసిన సియా గోయల్, చేతన్ చౌదరిలను పోలీసులు క్షుణ్ణంగా విచారిస్తున్నారు. చేతన్‌తో లవ్ ఎఫైర్ వల్లే సియా, చేతన్ కలిసి కేతన్‌ను హత్య చేసినట్లు తేలింది. జూన్ 18న పూణేకు సమీపంలో ఉన్న లోహ్‌గఢ్ కోట పై నుంచి కేతన్‌ను తోసి హత్య చేశారు.

పెళ్లి చేసుకోవడం తనకు ఇష్టం లేకపోవడంతో, తనకు మూడేళ్లు సమయం దొరుకుతుందని భావించి కేతన్‌ను హత్య చేసినట్లు నిందితురాలు సియా గోయల్ నిర్ణయించుకుందని పోలీసులు వెల్లడించారు. సియా, చేతన్ ఇద్దరూ కలిసి ఈ హత్యకు ముందుగానే పక్కా ప్లాన్ వేశారు. పెళ్లిని రద్దు చేస్తే కుటుంబ సభ్యులకు బాధ కలుగుతుందని, వారికి చెప్పడం కన్నా చంపడమే ఈజీ అని సియా భావించినట్లు విచారణలో వెల్లడైంది. కేతన్‌తో ఎంగేజ్మెంట్ కన్నా ముందే, సియాకు చేతన్‌తో లవ్ ఎఫైర్ ఉంది. జనవరిలో స్నేహితులతో కలిసి ఉదయ్‌పూర్ వెళ్లిన సమయంలో వీరిద్దరు మరింత దగ్గరైనట్లు తేలింది. ఆ తర్వాత ఫిబ్రవరిలో సియాకు కేతన్‌తో ఎంగేజ్మెంట్ జరిగింది.

జనవరి నుంచి ఇద్దరి మధ్య ఏకంగా 2000లకు పైగా కాల్స్ నడిచాయి. 238 గంటలు మాట్లాడుకున్నారు. వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్, ఇతర సోషల్ మీడియాల్లో ఇద్దరూ సంప్రదింపులు జరుపుకున్నారు. హత్యకు ముందు తర్వాత, ఈ చాట్స్‌ను డిలీట్ చేశారు. ఈ వివరాలను రికవరీ చేసేందుకు వీరిద్దరి మొబైల్ ఫోన్లను ఫోరెన్సిక్ పరీక్షకు పంపారు.