Ketan Agarwal Murder: యూట్యూబ్ సెర్చ్, కేఫ్‌లో మంతనాలు.. కేతన్, సియా కేసులో కీలక ఆధారాలు..

  • కేతన్ అగర్వాల్ మర్డర్ కేసులో కీలక ఆధారాలు..
  • లోహ్‌గఢ్ కోట గురించి సెర్చ్ చేసిన సియా..
  • కాఫీ షాప్‌లోనే హత్యకు ప్లాన్ చేసిన సియా, చేతన్..
Ketan Murder Case

Ketan Murder Case

Ketan Agarwal Murder: కేతన్ అగర్వాల్ హత్య దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. కాబోయే భార్య సియా గోయల్, ఆమె లవర్ చేతన్ చౌదరిలు కలిసి హత్యకు ప్లాన్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. పూణేకు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న లోహ్‌గఢ్ కోటపై నుంచి తోసేసి కేతన్‌ను సియా హత్య చేసింది. ఈ కేసు విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో ఒక కాఫీ షాప్‌కు మారింది. పోలీసులకు లభించిని సియా, చేతన్‌ల వీడియో కీలకంగా మారింది.

వీరిద్దరు పూణేలోని ఒక కేఫ్‌లోనే కలుసుకుని, హత్యకు కుట్ర గురించి చర్చించినట్లు పోలీసులు చెబుతున్నారు. ఇద్దరూ జూన్ 17వ తేదీ సాయంత్రం పూణేలోని థర్డ్ వేవ్ కేఫ్‌కు వెళ్లారు. సాయంత్రం 4.35 గంటల ప్రాంతంలో సియా, చేతన్‌లు కేఫ్‌లోకి వెళ్లినట్లు సీసీటీవీ ఫుటేజీలో కనిపిస్తోంది. సుమారు గంట సేపు అక్కడే గడిపి, సాయంత్రం 5.30 గంటలకు వెళ్లిపోయారు. పోలీసులకు లభించిన డిజిటల్ ఆదారాలు, విచారణలో వెల్లడైన సమాచారం ఆధారంగా కేఫ్‌లోనే మొత్తం కుట్రకు ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.

ఇదే కాకుండా, సియా గోయల్ యూట్యూబ్‌లో లోహ్‌గఢ్ కోట గురించి సెర్చ్ చేసినట్లు గుర్తించారు. ఆమె ఆ ప్రదేశం వివరాలను చేతన్ చౌదరితో పంచుకుందని పోలీసులు ఆరోపిస్తున్నారు. ఈ సమాచారం కుట్రలో భాగమై ఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. పోలీసులు ఇద్దరు నిందితుల మొబైల్ ఫోన్లు, చాట్ రికార్డులు, ఇంటర్నెట్ సెర్చ్ హిస్టరీలు, వారి మధ్య జరిగిన సంభాషణలను కూడా పరిశీలిస్తున్నారు. ఈ డిజిటల్ ఆధారాలే కేసులో కీలకంగా మారొచ్చని అధికారులు భావిస్తున్నారు. లోహ్‌గఢ్ కోటను పలుమార్లు రెక్కీ చేసి, ఎక్కడ నుంచి తోస్తే చనిపోతాడు, ఎక్కడ జనాల సంచారం తక్కువగా ఉంటుందని గమనించి సియా, చేతన్ కలిసి కుట్రను అమలు చేసినట్లు తెలుస్తోంది.