Ketan Agarwal Case: సియా తండ్రికి గుండెపోటు.. కూతురిని ఉరితీయాలని ప్రకటన

  • సియా తండ్రికి గుండెపోటు
  • ఐసీయూలో ప్రత్యేక వైద్యం
  • కూతురిని ఉరితీయాలని ప్రకటన
Ketanagarwalcas3

Ketanagarwalcas3

నవమాసాలు మోసిన కన్నపేగు.. ఇంకోవైపు గుండెల మీద ఎత్తుకుని పెంచిన కన్నతండ్రి ప్రేమ. అల్లారి ముద్దుగా పెంచి పెద్ద చేసి ఓ ఇంటిరాలిని చేసి.. గొప్పగా ఉండాలని కోరుకున్నారు. కానీ ఆ కూతురే గుండెల మీద తన్నుతుందని ఏ మాత్రం ఊహించలేకపోయారు. కొద్దిరోజులుగా కన్న బిడ్డ చేసిన ఘనకార్యం గురించి మీడియా ఛానల్స్‌లో.. సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను చూసి కన్నతండ్రి గుండె పగిలిపోయింది. దీంతో తీవ్రమైన గుండెపోటు రావడంతో సియా తండ్రి ఆస్పత్రి బెడ్ మీద పడ్డాడు. ఆస్పత్రిలో కోలుకుంటున్న తండ్రి.. తన కుమార్తెను.. ప్రియుడిని ఉరితీయాలని డిమాండ్ చేస్తున్నాడు.

తమ కుమార్తె దోషి అయితే.. వెంటనే ఉరిశిక్ష విధించాలని సియా తండ్రి ప్రవీణ్ గోయల్, తల్లి డిమాండ్ చేశారు. సియా తండ్రి గుండెపోటుకు గురవ్వడంతో ప్రస్తుతం పుణెలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ సందర్భంగాస్థానిక ఛానల్‌తో మాట్లాడారు.. ‘‘నిందితులైన వారికి అత్యంత కఠినమైన శిక్ష పడాలి.. ఆ శిక్ష విధించడంలో ఏమాత్రం ఆలస్యం జరగకూడదు అని నేను మనస్ఫూర్తిగా చెబుతున్నాను.’’ అని అన్నారు. సియా తల్లి పూజా గోయల్ మాట్లాడుతూ.. ‘‘నా కూతురు నేరం చేసి ఉంటే.. ఆమెకు వెంటనే ఉరిశిక్ష విధించాలి. నిందితులకు తప్పక శిక్ష పడాలి. ఇది ఒక తల్లి చెబుతున్న మాట.’’ అని పేర్కొన్నారు.

సియా గోయల్ తండ్రి ప్రవీణ్ గోయల్ గురువారం అకస్మాత్తుగా అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరారు. తీవ్రమైన ఛాతీ నొప్పితో బాధపడటంతో రూబీ హాల్ క్లినిక్‌కు తీసుకువెళ్లినట్లు సమాచారం. కేతన్ హత్య కేసు దర్యాప్తు వల్ల నెలకొన్న తీవ్ర ఒత్తిడి కారణంగా ఆయనకు గుండెపోటు వచ్చినట్లు తెలుస్తోంది. పరిస్థితిని పర్యవేక్షించడానికి ఐసీయూ చుట్టుపక్కల ప్రాంతాన్ని సురక్షితంగా ఉంచడానికి ఆసుపత్రి ప్రాంగణంలో కట్టుదిట్టమైన నిఘా ఏర్పాటు చేశారు. అధికారులు కుటుంబాన్ని నిశితంగా పర్యవేక్షిస్తుండగా, వైద్యులు నిందితుడి తండ్రి కోలుకోవడాన్ని.. ఆరోగ్య పారామితులను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.

పూణె యువ వ్యాపార వేత్త కేతన్ అగర్వాల్ తల్లిదండ్రులకు.. సియా తల్లిదండ్రులకు రెండు దశాబ్దాలుగా సంబంధాలు ఉన్నాయి. ఈ కారణంతోనే ఈ జంటకు వివాహం కుదుర్చారు. కానీ సియా మాత్రం ప్రియుడి మోజులో పడి.. పెళ్లి కాకముందే కాబోయే భర్తను కాటికి పంపేసింది.