BJP: ఉత్తర్ ప్రదేశ్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికారి బీజేపీకి, సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) షాక్ ఇచ్చింది. మొత్తం 11 స్థానాల్లో బీజేపీ 6, ఎస్పీ 5 స్థానాలను గెలుచుకున్నాయి. అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని నెలల ముందు జరిగిన ఈ ఎన్నికల్లో బీజేపీలో కలవరాన్ని పెంచుతున్నాయి. బీజేపీ కంచుకోటలైన వారణాసి, ఆగ్రాల్లో ఎస్పీ గెలుపొందింది. ఇదిలా ఉంటే, ఈ ఎన్నికలు రెండు పార్టీల మధ్య మాటల యుద్ధాన్ని పెంచాయి. తాము ఊహించి దానికన్న తక్కువ స్థానాలు గెలిచామని యూపీ డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య అన్నారు. ఎస్పీ గెలవకూడని చోట్ల కూడా విజయం సాధించిందని వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో మళ్లీ బీజేపీ గెలిచేలా కృషి చేస్తామని చెప్పారు.
కేశవ్ మౌర్య వ్యాఖ్యలపై ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ స్పందించారు. ఎస్పీ విజయంతో బీజేపీ నేతలు అంతర్గతంగా సంతోషిస్తున్నారని వ్యాఖ్యానించారు. ఇల్లు విడిచి బయటకు వచ్చినంత మాత్రాన ఎవరూ పరాయివారు అయిపోరు అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. గోరఖ్‌పూర్‌లో బీజేపీ అనేక అక్రమాలు చేసిందని అఖిలేష్ ఆరోపించారు. వారణాసిలో ఎస్పీ సాధించిన విజయాన్ని గోరఖ్‌పూర్‌లో అడ్డుకునేందుకు ప్రయత్నించారని పేర్కొన్నారు. ఎన్నికల్లో బీజేపీ నైతికంగా ఓడిపోయిందని అన్నారు.
