Site icon NTV Telugu

మూడో వారంలో తెరుచుకోనున్న శబరిమల ఆలయం

కేరళలోని శబరిమల అయ్యప్ప ఆలయం ఈ నెల మూడో వారంలో తెరచుకోనుంది.. ఈనెల 15వ తేదీ నుంచి రెండు నెల‌ల పాటు భక్తులకు దర్శనమివ్వనున్నారు అయ్యప్ప స్వామి.. భక్తుల మండ‌ల పూజ కోసం ఆల‌యాన్ని 15వ తేదీ నుంచి తెర‌వ‌నున్నట్లు ఆల‌య అధికారులు తెలిపారు.. ఇక, ఇవాళ చితిర అత్తవిశేష పూజ సంద‌ర్భంగా ఆల‌యాన్ని తెరిచారు పూజారాలు.. పూజ ముగిసిన త‌ర్వాత రాత్రి 9 గంట‌ల‌కు తిరిగి ఆల‌యాన్ని మూసివేయనున్నారు.. కరోనా పరిస్థితుల దృష్ట్యా ప్రత్యేక చర్యలు చేపట్టారు అధికారులు.. అయ్యప్ప భ‌క్తుల‌కు వ‌ర్చువ‌ల్ క్యూ బుకింగ్ వ్యవ‌స్థ ద్వారా అనుమ‌తి క‌ల్పిస్తున్నారు. దైవ ద‌ర్శనం కోసం వ‌చ్చేవారికి వ్యాక్సినేష‌న్ స‌ర్టిఫికేట్‌ తప్పనిసరి చేశారు. పూర్తి స్థాయిలో అంటే రెండు డేసుల వ్యాక్సిన్‌ వేయించుకొని ఉండాలి.. లేదా 72 గంట‌ల లోపు ఆర్టీపీసీఆర్ టెస్ట్‌ చేయించుకుని నెగిజిటివ్‌ రిపోర్ట్‌ను అయినా తీసుకొని రావాల్సి ఉంటుందని స్పష్టం చేస్తోంది ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు.

Exit mobile version