Biryani: కేరళలో బిర్యానీ ఓ మహిళ ప్రాణాలను తీసింది. వివారాల్లోకి వెళ్తే త్రిసూర్ జిల్లాలోని పెరింజనం ప్రాంతంలోని స్థానిక రెస్టారెంట్‌లోని బిర్యానీ తిన్న సుమారు 178 మందికి ఫుడ్ పాయిజనింగ్ అయింది. వీరిలో ఒక మహిళ ప్రాణాలు కోల్పోయారు. కుటిలక్కడవ్‌కి చెందిన నుజైబా(56) బిర్యానీ తిన్న తర్వాత తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే ఆమెను స్థానికం ఉన్న ఆరోగ్య కేంద్రానికి అక్కడ నుంచి ఇరింజలకుడలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఆమెను మెడికల్ కాలేజీకి తరలించారు. చికిత్స పొందుతూ నుసైబా మంగళవారం మరణించారు.
Read Also: Rashmika: నీయబ్బ, ఆనంద్.. నువ్వు నా ఫ్యామిలీ రా.. రష్మిక ఏంటి ఇలా ఓపెన్ అయిపోయింది!
ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టంకి తరలించారు. మరణానికి కారణాలపై శాస్త్రీయ పరిశోధన జరగనుంది. ఫుడ్ పాయిజన్ అయిందన్న అనుమానంతో పోలీసులు,ఆరోగ్య శాఖ అధికారులు, ఫుడ్ సేఫ్టీ డిపార్ట్‌మెంట్ ప్రతినిధులు, పంచాయతీ అధికారులు, పోలీసులతో కలిసి రెస్టారెంట్‌లో తనిఖీలు నిర్వహించారు. ఈ ఘటనపై పంచాయతీ అధికారులు స్పందించి రెస్టారెంట్‌పై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. అపరిశుభ్రతతో హోటల్ నిర్వహిస్తున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు గుర్తించారు. ఈ విషయమై కయపమంగళం పోలీస్‌స్టేషన్, పెరింజనం పంచాయతీలో ఫిర్యాదు చేశారు. అదనంగా, ఫుడ్ పాయిజనింగ్ కారణంగా ఆసుపత్రిలో చేరిన వారిని కలుసుకుని సమాచారాన్ని సేకరించారు.
రెస్టారెంట్‌లోని మయోనెస్, కేరళలో ప్రసిద్ధి చెందిన బిర్యానీలాంటి యెమెన్ వంటకం ‘కుజి మండి’ తినడం వల్లే మహిళ మరణించినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. బాధితుల్లో ఎక్కువ మంది పెరింజనం, కైపమంగళానికి చెందినవారే. కేరళ ప్రభుత్వం 2023 జనవరిలో రాష్ట్రవ్యాప్తంగా ఫుడ్ పాయిజనింగ్ కేసుల కారణంగా రాష్ట్రంలోని రెస్టారెంట్లలో గుడ్లతో తయారు చేసిన మయోనైజ్‌ను నిషేధించింది. కాసర్‌గోడ్‌కు చెందిన అంజు శ్రీపార్వతి అనే 20 ఏళ్ల యువతి రెస్టారెంట్‌లో మండి తిని మరణించడంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.