Kerala: రెండు రోజుల క్రితం కొచ్చిలో 23 ఏళ్ల యువతి ఓ బిడ్డకు బాత్రూంలో జన్మనిచ్చి, ఈ విషయం తల్లిదండ్రులకు తెలుస్తుందనే భయంతో నవజాత శిశును 5వ అంతస్తు నుంచి రోడ్డుపై విసిరేసింది. ఈ ఘటనలో శిశువు మరణించింది. శిశువును చుట్టిన కవర్‌పై ఉన్న బార్‌కోడ్ ఆధారంగా పోలీసులు నిందితురాలైన తల్లిని గుర్తించారు. ఈ ఘటన సంచలనంగా మారింది. దీనిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. అయితే, తమ కుమార్తె గర్భవతి అని తల్లిదండ్రులకు కూడా తెలియకపోవడం గమనార్హం. పుట్టిన బిడ్డ ఏడవడంతో విషయం ఎక్కడ బయపడుతుందనే భయంతో నిందితురాలు బిడ్డ గొంతు నులిమి, రోడ్డుపై విసిరేసింది.
Read Also: Devendra Fadnavis: కసబ్ గురించి కాంగ్రెస్ ఆందోళన.. 26/11 దాడులపై రాజకీయం..
ఈ ఘటన మరవక ముందే ఆదివారం కొచ్చిలోనే మరో ఘటన చోటు చేసుకుంది. 22 ఏళ్ల మహిళ హాస్టర్ వాష్‌రూములో బిడ్డను ప్రసవించింది. ఓ కంపెనీలో పనిచేస్తు్న్న కొల్లాంకు చెందిన మహిళ ఓ ప్రైవేట్ హాస్టల్ బాత్రూంలో బిడ్డను ప్రసవించింది. అయితే ఆమె గర్భవతి అనే విషయం హాస్టల్ మేట్స్‌కి తెలియదు. చాలాసేపు బాత్ రూపంలోనే లాక్ చేసుకుని ఉండటంతో అనుమానించిన హాస్టల్ మేట్స్ బలవంతంగా డోర్ తెరవడంతో విషయం వెలుగులోకి వచ్చింది. హాస్టర్ అధికారులు పోలీసులకు సమాచారం అందించారు. తల్లి, బిడ్డను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వీరిద్దరి క్షేమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఆమె కుటుంబ సభ్యులకు విషయం తెలియజేశామని, ఆమె సన్నిహితులు కూడా ఆస్పత్రికి చేరారని వారు తెలిపారు.
