Kerala: కేరళలో భారీ పేలుడు.. 8 మంది దుర్మరణం..

  • కేరళలో తీవ్ర విషాదం..
  • బాణాసంచా తయారీ సమయంలో పేలుడు..
  • 8 మంది మృతి, పలువురికి గాయాలు..
Kerala

Kerala

Kerala: వరసగా బాణాసంచా ఫ్యాక్టరీల్లో పేలుళ్లు ఆందోళన కలిగిస్తున్నాయి. కేరళలోని త్రిసూర్‌లో మంగళవారం నాడు మరో బాణాసంచా తయారీలో భారీ పేలుడు సంభవించింది. ఈ దుర్ఘటనలో 8 మంది మరణించారు. పలువరు గాయపడినట్లు అధికారులు తెలిపారు. ఈ పేలుడుకు గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేస్తు్న్నారు. ‘‘త్రిసూర్ పూరం’’ ఉత్సవాల కోసం బాణాసంచా తయారు చేస్తున్న ఒక షెడ్డులో ఈ పేలుడు సంభవించింది. మంగళవారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో పేలుళ్లు జరిగాయి.

Read Also: Tragedy: ప్రాణం తీసిన సోషల్ మీడియా క్రేజ్.. మైనర్ బాలుడి మృతి.!

పేలుడు జరిగిన సమయంలో కర్మాగారంలో 40 మంది ఉన్నట్లు భావిస్తున్నారు. వీరిలో చాలా మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఘటన జరిగిన వెంటనే అధికారులు సంఘటనా స్థలానికి చేరి, సహాయక చర్యల్ని ప్రారంభించారు. మరణించిన వారికి సీఎం పినరయి విజయన్ సానుభూతి తెలియజేశారు. మెరుగైన వైద్య సహాయాలు అందించాలని అధికారుల్ని ఆదేశించారు. త్రిసూర్ మెడికల్ కాలేజీలో అత్యవసర చికిత్సా ఏర్పాట్లు చేశారు. ఈ ఘటనకు ముందు తమిళనాడులోని విరూద్‌నగర్ జిల్లాలో బాణాసంచా తయారీలో జరిగిన పేలుడులో పది మందికి పైగా మరణించారు,