Site icon NTV Telugu

Kerala: కీచక టీచర్..26 మందిపై లైంగిక దాడి..

Kerala

Kerala

Kerala Teacher Arrested For Molesting 26 Students: విద్యా బుద్ధులు నేర్పాల్సిన వాడే బుద్ధి లేకుండా ప్రవర్తించాడు. విద్యార్థినులపై లైంగిక దాడి చేస్తూ పశువాంఛ తీర్చుకుంటున్నాడు. మొత్తం 26 మంది విద్యార్థినుల 52 ఏళ్ల ఉపాధ్యాయుడు లైంగికంగా వేధించాడు. ఈ ఘటన కేరళలోని కన్నూర్ లో జరిగింది. నవంబర్ 2021 నుంచి 26 మంది విద్యార్థులపై వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. జిల్లాలో ఎయిడెడ్ పాఠశాలో పనిచేస్తున్న ఉపాధ్యాయుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.

Read Also: Vande Bharat Train: వందేభారత్ ట్రైన్ ప్రారంభానికి అంతా రెడీ

ఇటీవల ఓ విద్యార్థిని తాను ఎదుర్కొన్న వేధింపులను పాఠశాలలోని మరో ఉపాధ్యాయుడికి వివరించడంతో అతడి బాగోతం బయటకు వచ్చింది. జిల్లా చైల్డ్ లైన్ అధికారులు ఫిర్యాదు చేయడంతో సదరు కీచక టీచర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. జనవరి 12న లైంగిక నేరాల నుంచి పిల్లలను రక్షించే చట్టం (పోక్సో) చట్టం కింద సదరు వ్యక్తిపై కేసు నమోదు చేశారు.

కౌన్సిలింగ్ తరువాత చాలా మంది విద్యార్థులు, కీచక టీచర్ తమపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని చెప్పడంతో పోలీసులు కేసును సీరియస్ గా తీసుకున్నారు. జనవరి 12న ఐదు కేసులు నమోదు చేయగా.. శనివారం మరో 21 కేసులు నమోదు చేశారు. నిందితుడిని జ్యుడిషియల్ కస్టడీకి తరలించినట్లు పోలీసులు వెల్లడించారు. కోవిడ్ మహమ్మారి తర్వాత పాఠశాలలు తెరిచిన తర్వాత నుంచి నిందితుడు పిల్లలపై వేధింపులకు పాల్పడుతున్నట్లు విద్యార్థులు పోలీసులు ఫిర్యాదు చేశారు.

Exit mobile version