Site icon NTV Telugu

Kerala stray dog menace: కేరళలో రేబిస్‌తో 21 మంది మృతి.. వీధి కుక్కలను దారుణంగా చంపుతున్న ప్రజలు

Kerala

Kerala

Kerala stray dog menace: కేరళలో ఇటీవల కాలంలో వీధి కుక్కల దాడులు ఎక్కువయ్యాయి. కుక్కలను చూస్తేనే జనాలు వణికిపోతున్నారు. నడిరోడ్డపై వెళ్తున్న ప్రజలపై దారుణంగా దాడులు చేస్తున్నాయి. కేరళలోని వీధి కుక్కల బెడద దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. పలు సందర్భాల్లో వీధి కుక్కలు చేసిన దాడులు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కేరళలో ఏ ఏడాది కుక్క కాటు వల్ల రేబిస్ సోకి ఇప్పటి వరకు 21 మంది మరణించారు. దీన్ని బట్టి చూస్తే అక్కడ కుక్కల దాడులు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. చనిపోయిన 21 మందిలో 15మంది రేబిస్ టీకాను తీసుకోకపోవడం వల్ల మరణిస్తే.. మరికొంత మంది తీసుకున్నప్పటికీ ప్రాణాలు దక్కలేదు.

కేరళలోని కొట్టాయం జిల్లాతో పాటు రాష్ట్రవ్యాప్తంగా కుక్కల దాడులు పెరుగుతుండటంతో ప్రజలు.. వీధి కుక్కలు కనిపిస్తే చాలు చంపేస్తున్నారు. కొన్ని కుక్కల్ని బహిరంగంగా ఉరి తీస్తున్నారు. ప్రస్తుతం వీధి కుక్కల్ని క్రూరంగా చంపుతన్న ఘటనలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. కుక్కలకు విషప్రయోగం చేసి చంపుతున్నారు. ఈ ఘటనలపై కొంత మంది జంతు ప్రేమికులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. కుక్కల్ని ఇంత క్రూరంగా చంపడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రజలు మాత్రం తమను రక్షించుకోవాలంటే వాటిని చంపేయడమే ఒక్కటే మార్గం అని చెబుతున్నారు. కుక్కల బారి నుంచి తమ పిల్లల్ని రక్షించుకునేందుకు పెద్ద వాళ్లు ఎస్కార్ట్ గా వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. ఎయిర్ గన్ సహాయంతో.. పిల్లలను స్కూల్ కు తీసుకెళ్తున్న వీడియో ఒకటి వైరల్ అయింది.

Read Also: Influenza Cases Rise: పుదుచ్చేరిలో ఇన్‌ఫ్లూయెంజా కలకలం.. స్కూళ్లు మూసేయాలని ఆదేశం

కోజికోడ్ మేయర్ బీనా ఫిలప్.. కుక్కల్ని చంపడంపై మొదట్లో సానుకూలంగా లేకపోయినప్పటికీ.. ప్రస్తుతం ప్రజల్లో ఏర్పడిన భయాలతో వారు కుక్కల్ని చంపేస్తున్నారని.. దీన్ని నిందించలేమని అన్నారు. ఈ విషయంలో కేరళ హైకోర్టు కూడా జోక్యం చేసుకుంది. కుక్కల జనాభాను నియంత్రించేందుకు టీకానలు వేయాలని ఆదేశాలు జారీ చేసింది. ప్రజలను రక్షించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. కేరళ సీఎం పినరయి విజయన్ మాట్లాడుతూ.. కుక్కల బెదడను ఎదుర్కొవడానికి ప్రజలు హింసాత్మక చర్యలకు పాల్పడవద్దని కోరారు. వీధి కుక్కలను చంపడం.. విషప్రయోగం చేయడం సమస్యకు పరిష్కారం కాదని ఆయన అన్నారు. రాష్ట్రంలోని చాలా స్థానిక ప్రభుత్వ సంస్థల్లో వీధి కుక్కలకు ఇంటెన్సివ్ వ్యాక్సినేషన్ డ్రైవ్ ప్రారంభించామని పినరయి విజయన్ తెలిపారు. అక్టోబర్ 20 వరకు ఇంటెన్సివ్ వ్యాక్సిన్ ప్రచారం నిర్వహించాలని ఆదేశాాలు జారీ చేశారు.

 

Exit mobile version