NTV Telugu Site icon

Brain-Eating Amoeba: కేరళను భయపెడుతున్న పీఏఎం వ్యాధి.. ఇప్పటి వరకు ముగ్గురు మృతి

Kerala

Kerala

Brain-Eating Amoeba: కేరళ రాష్ట్రాన్ని బ్రెయిన్ ఈటింగ్ వ్యాధి భయపెడుతుంది. కోజికోడ్ లో మెదడుని తినే అమీబిక్ మెనింగో ఎన్సెఫాలిటిస్ (పీఏఎం) వ్యాధితో 15 ఏళ్ల బాలుడు మరణించాడు. చెరువులో స్నానానికి దిగిన తర్వాత అతడికి ఈ వ్యాధి వచ్చింది. కోజికోడ్ లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో పీఏఎంతో ఐదేళ్ల బాలిక ట్రిట్మెంట్ తీసుకుంటుంది. దీంతో, కేరళలో పీపీఎంకి సంబంధించిన నాలుగో కేసు కూడా నమోదైంది. కోజికోడ్ లో గత రెండు నెలల్లోనే అరుదైన ఇన్ఫెక్షన్ తో ఇప్పటి వరకు మొత్తంగా ముగ్గురు చనిపోయారు. కాగా, పీఏఎం వ్యాధి నివారణ కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ అధ్యక్షతన శుక్రవారం ఉన్నత స్థాయి భేటీ జరిగింది. మురికి నీటి ప్రదేశాల్లో ఈతకు ఎవరూ వెళ్లకుండా చూడాలని అధికారులను ఆదేశాలు జారీ చేశారు.

Read Also: Hyderabad Rains: హైదరాబాద్‌ కు పొంచి ఉన్న వరుణుడి ముప్పు.. రెండు రోజులు భారీ వర్షాలు..

ఇక, స్విమ్మింగ్ పూల్స్‌లో క్లోరినేషన్ తప్పని సరి చేయాలని సీఎం విజయన్ పేర్కొన్నారు. చిన్నారులు ఈ వ్యాధి బారిన పడే ఛాన్స్ ఎక్కువగా ఉందన్నారు. పిల్లలు ఈతకు వెళ్లేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. స్విమ్మింగ్ చేసేటప్పుడు నోస్ క్లిప్‌లను వాడటం వల్ల ఈ ఇన్ఫెక్షన్ ను నివారించవచ్చన్నారు. అంటువ్యాధులను నివారించడానికి నీటి వనరులను పరిశుభ్రంగా ఉంచడం సమష్టి బాధ్యత అని అధికారులకు ఆయన సూచించారు. అయితే, పీఏఎం అనే వ్యాధి నేగ్లేరియా ఫౌలెరి అనే అమీబా వల్ల వస్తుంది అని నిపుణులు తెలిపారు. ఈ అమీబా నీటి ద్వారా మనిషి శరీరంలోకి చేరుతుంది. నాలుగు రోజుల్లోనే మానవ నాడీ వ్యవస్థపై (మెదడుపై) దాడి చేస్తుందని చెప్పారు.

Read Also: Top Headlines @ 1 PM: టాప్‌ న్యూస్‌

అలాగే, 14 రోజుల వ్యవధిలోనే దాని వల్ల మెదడులో వాపు వస్తుంది అని ఆరోగ్య నిపుణులు తెలిపారు. ఫలితంగా బాధితుడు చనిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నారు. ఈ ఏడాది కేరళలో ఈ వ్యాధి కారణంగా ఇప్పటి వరకూ ముగ్గురు చనిపోయారని చెప్పారు. ఇకపోతే, మే 21న పీఏఎం వ్యాధి వల్ల కేరళలో తొలి మరణం నమోదు కాగా.. మలప్పురానికి చెందిన ఐదేళ్ల బాలిక పీఏఎంతో రెండో మరణం సంభవించగా.. ఆ తర్వాత జూన్ 12వ తేదీన కన్నూరుకు చెందిన 13 ఏళ్ల బాలిక ఆ వ్యాధితో మరణించడం మూడొది కాగా.. ఇప్పుడు 14 ఏళ్ల బాలుడు చనిపోయాడు.