Site icon NTV Telugu

మహిళ మృతి కేసు.. సంచలనంగా మారిన పోలీసులు దర్యాప్తు

సంవత్సరం క్రితం జరిగిన ఓ మహిళ హత్య కేసు దర్యాప్తులో పోలీసుల దర్యాప్తు సంచలనంగా మారింది.. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కేరళలో గత ఏడాది నుంచి వరకట్న వేధింపుల సమస్యలతో మహిళా మృతి ఘటన ఎక్కవగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో గత మే 7, 2020న కొట్టరక్కాకు చెందిన ఉత్తర అనే దివ్యాంగురాలైన వివాహిత పాము కాటుతో మృతి చెందింది. అయితే, ఉత్తర మరణంపై తల్లిదండ్రులకు అనుమానం వచ్చింది… ఆస్తి కోసం ఆమెను పెళ్లాడిన భర్త సూరజ్‌ పకడ్బందీగా ప్లాన్‌ చేసి చంపాడని పోలీసులకు ఫిర్యాదు చేశారు బాధితుల తల్లిదండ్రులు.. ఇక, కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు ముమ్మరం చేశారు.. ఇక, కేరళ పోలీసు బృందం సజీవ పాము, డమ్మీ బొమ్మను దాని చేతిని ఉపయోగించి సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌ చేశారు. కొల్లం జిల్లాలోని అరిప్పలో అటవీ శాఖ ఆధ్వర్యంలోని రాష్ట్ర శిక్షణా కేంద్రంలో పోలీసుల సీన్ రీకన్‌స్ట్రక్షన్‌ చేసిన వీడియో కోర్టులో ప్రవేశ పెట్టబోతున్నారు. ఈ కేసులో పోలీసుల దర్యాప్తు ఇప్పుడు సంచలనంగా మారిపోయింది.

Exit mobile version