Police Brutality:అమానుష ఘటన.. బాలింతపై పోలీస్ దాడి..
- కేరళ రాష్ట్రం కొచ్చిలో అమానుష ఘటన
- ఎర్నాకులంలో బాలింతపై పోలీస్ అధికారి దాడి
- మండిపడుతున్న స్థానికులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేరళ రాష్ట్రం కొచ్చిలో చోటుచేసుకున్న ఒక అమానుష ఘటన తీవ్ర దుమారం రేపుతోంది. ఎర్నాకులం నార్త్ పోలీస్ స్టేషన్‌లో బాలింతపై పోలీస్ అధికారి దాడి చేసిన ఘటన మానవత్వానికే మచ్చగా మారింది. రక్షణ కల్పించాల్సిన పోలీసులే ఈ తరహా దారుణానికి పాల్పడటంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాలింత పరిస్థితిని పరిగణనలోకి తీసుకోకుండా ఆమెపై దౌర్జన్యం చేయడం అమానవీయమని, ఈ ఘటనకు బాధ్యులైన అధికారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఉన్నతాధికారులు వెంటనే స్పందించి బాధితురాలికి న్యాయం చేయాలని కోరుతున్నారు.
పూర్తి వివరాల్లోకి వెళితే, 2024 జూన్ 18న కేరళ రాష్ట్రం కొచ్చిలోని ఎర్నాకులం నార్త్ పోలీస్ స్టేషన్‌లో ఈ ఘటన జరిగింది. అప్పట్లో స్టేషన్ హౌస్ ఆఫీసర్‌గా విధులు నిర్వహిస్తున్న ప్రతాప్ చంద్రన్, శైమోల్ ఎన్.జే అనే బాలింతను తోసి, అనంతరం చెంపదెబ్బ కొట్టినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ దాడికి సంబంధించిన దృశ్యాలు పోలీస్ స్టేషన్‌లోని సీసీటీవీ ఫుటేజ్‌లో స్పష్టంగా కనిపించడంతో, అధికార యంత్రాంగం స్పందించి సంబంధిత పోలీస్ అధికారిని సస్పెండ్ చేసింది.
Also Read
- MDMA Factory: ఇంత టాలెంటెడ్ గా ఉన్నావేంట్రా నువ్వు.. ఇంట్లోనే MDMA తయారీ కేంద్రం పెట్టేశావ్.!
- PM Modi: ఎర్రకోట వేదికగా యూత్‌కు ప్రధాని మోడీ గుడ్‌న్యూస్.. కోటి మంది యువతకు ఉచితంగా..
- PM Modi: ప్రభుత్వ అధికార వర్గాల్లోనూ మావోయిస్టు భావజాలం.. 'అర్బన్ నక్సల్స్'ను సమాజం దూరం పెట్టాలి..
- Trisha Krishnan: సీఎం విజయ్ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో త్రిష.. ఫ్రంట్ రోలో కూర్చుని సెల్యూట్
ఈ ఘటన జరిగినప్పటికీ, దాదాపు ఏడాది పాటు న్యాయపోరాటం కొనసాగిన తర్వాతే సీసీటీవీ ఫుటేజ్ వెలుగులోకి వచ్చింది. శైమోల్ హైకోర్టును ఆశ్రయించగా, కోర్టు ఆదేశాల మేరకు ఆ ఫుటేజ్ ఆమెకు అందింది. ఆ వీడియోలే పోలీస్ అధికారి దౌర్జన్యానికి ప్రత్యక్ష ఆధారాలుగా మారాయి.
శైమోల్ భర్త బెన్ జో, రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న తమ పర్యాటక వసతి కేంద్రం వద్ద ఇద్దరు వ్యక్తులను పోలీసులు బలవంతంగా అదుపులోకి తీసుకుంటున్న దృశ్యాలను వీడియోగా చిత్రీకరించాడు. వారు దొంగతనానికి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. అయితే ఈ వీడియో తీసిన కారణంగా బెన్ జోను పోలీసులు అదుపులోకి తీసుకుని, పోలీసుల విధులకు ఆటంకం కలిగించాడనే ఆరోపణలతో కేసులో మూడో నిందితుడిగా చేర్చారు.
భర్తను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని తెలుసుకున్న శైమోల్ విచారణ నిమిత్తం పోలీస్ స్టేషన్‌కు వెళ్లింది. అక్కడ ఆమెకు, ఎస్‌హెచ్‌వో ప్రతాప్ చంద్రన్‌కు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ సమయంలోనే అధికారి ఆమెను తోసి, అనంతరం చెంపదెబ్బ కొట్టినట్లు సీసీటీవీ ఫుటేజ్‌లో స్పష్టంగా కనిపిస్తోంది. తాను బాలింతనని పలుమార్లు పోలీసులకు చెప్పినా వారు పట్టించుకోలేదని శైమోల్‌తో పాటు ఆమె భర్త ఆరోపించారు.
ఈ ఘటన వివరాలు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌తో పాటు రాష్ట్ర డీజీపీ చంద్రశేఖర్ వరకు చేరాయి. దీనిపై విచారణ చేపట్టిన ఉన్నతాధికారులు చివరకు సంబంధిత పోలీస్ అధికారిపై కఠిన చర్యలు తీసుకుంటూ సస్పెన్షన్ వేటు వేశారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
A police inspector has been suspended after CCTV footage surfaced showing a pregnant woman being slapped and pushed inside the Ernakulam North police station.
The incident occurred on June 18, 2024 and the inspector has been identified as #PrathapChandran.
The CCTV footage… https://t.co/P2ISnlXMFW pic.twitter.com/1FnN4FeVnW
— Hate Detector 🔍 (@HateDetectors) December 19, 2025
తాజావార్తలు
-
Mahindra BE 6 SPORTEQ: మహీంద్రా BE6 స్పోర్టెక్ ఎలక్ట్రిక్ SUV విడుదల.. 683KM రేంజ్, Gemini AIతో అదిరిపోయే ఫీచర్లు
-
Saira Banu First Look: ముస్లిం అమ్మాయిని ప్రేమించే యువకుడిగా ఆది.. ఆకట్టుకుంటున్న ‘సైరాబాను’ ఫస్ట్ లుక్..
-
Rohit Sharma: రోహిత్ శర్మ రిటైర్మెంట్కు బ్రేక్..! హిట్‌మ్యాన్‌కు మరో అవకాశం
-
Team India: బ్రిటీషర్ల గడ్డపై స్వాతంత్య్ర దినోత్సవం.. లండన్‌లో జెండా ఎగరేసిన విరాట్ కోహ్లీ.. గుర్తుందా?
-
Homemade Ghee: ఇంట్లోనే సులభంగా కమ్మనైన, స్వచ్ఛమైన ‘నెయ్యి’ని తయారు చేయండి ఇలా..!
ట్రెండింగ్
-
Redmi Note 17 5G vs Moto G Max 5G: మిడ్‌రేంజ్‌లో బెస్ట్ స్మార్ట్‌ఫోన్ ఏది.?
-
డిజైన్, ఫీచర్లలో భారీ అప్డేట్స్ తో సెప్టెంబర్ 5న రాబోతున్న Maruti Baleno Facelift..!
-
కొత్త పికప్ ట్రక్ Mahindra Scorpio Lifestyler వచ్చేస్తోంది.. ధర, ఫీచర్లు ఇవే!
-
48dB ANC, AI మీటింగ్ సమ్మరీ.. భారత్‌లో POVA AI Buds Pro లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
Healthy Snacks : నల్లగా మారిన అరటిపండ్లు పారేయొద్దు.. ఇలా చేస్తే అదిరిపోయే టేస్టీ డెజర్ట్స్.!