Site icon NTV Telugu

Kerala: కేరళ ఎమ్మెల్యేకు చేదు అనుభవం.. సమస్యలు పట్టించుకోవడం లేదని చొక్కాలాగిన మహిళలు

Kerala

Kerala

కేరళలోని కన్నూర్ జిల్లాలో ఎమ్మెల్యే కేపీ.మోహనన్‌కు చేదు అనుభవం ఎదురైంది. తమ సమస్యలు పట్టించుకోవడం లేదని స్థానికులు తీవ్ర ఆగ్రహం చేశారు. అంగన్వాడీ కేంద్రం ప్రారంభించేందుకు ఎమ్మెల్యే రాగానే స్థానికులు నిలదీశారు. తప్పించుకుని పారిపోతుండగా మహిళలు చొక్కా పట్టుకుని నిలదీశారు. మరికొందరు చొక్కాలాగారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

స్థానిక డయాలసిస్ కేంద్రం దగ్గర చెత్త తొలగించకపోవడం స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అనేక మంది రోగాల పాలవుతున్నారు. అయితే ఎమ్మెల్యేకు ఎన్ని సార్లు చెప్పినా పట్టించుకోవడం లేదు. దీంతో స్థానికులు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. గురువారం కుతుపరంపు నియోజకవర్గంలో అంగన్వాడీ కేంద్రం ప్రారంభోత్సవానికి వచ్చిన ఎమ్మెల్యేను స్థానికులు నిలదీశారు. పట్టించుకోకుండా వెళ్లిపోతుండగా మహిళలు కాలర్ పట్టుకుని లాగేశారు. మొత్తానికి తప్పించుకుని వెళ్లిపోయారు.

ఇది కూడా చదవండి: Delhi Liquor Policy: ఢిల్లీలో కొత్త లిక్కర్ పాలసీకి ప్లాన్!.. 25 ఏళ్ల వయసు తగ్గించే యోచన

ఇక పోలీసులు 25 మంది స్థానికులపై కేసులు నమోదు చేశారు. చట్టవిరుద్ధంగా గుమిగూడినందుకు భారతీయ న్యాయ సంహితలోని ఇతర సెక్షన్ల కింద అభియోగాలు మోపారు. ఇక ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

 

Exit mobile version