కిడ్నీ పేషెంట్ చికిత్స కోసం బంగారు గాజులు విరాళంగా ఇచ్చి గొప్పమనసు చాటుకున్నారు కేరళ మంత్రి.. త్రిసూర్ జిల్లా ఇరింజలకుడ ప్రాంతంలో కిడ్నీ మార్పిడికి సంబంధించిన వైద్య సహాయ కమిటీ సమావేశంలో పాల్గొనాల్సిందిగా.. కేరళ కేరళ ఉన్నత విద్యా మంత్రి ఆర్ బిందుకు ఆహ్వానం అందింది.. దీంతో, ఆ సమావేశానికి హాజరయ్యారు మంత్రి.. అయితే, కిడ్నీ సమస్యతో బాధపడుతున్న 27 ఏళ్ల వివేక్ ప్రభాకర్ పరిస్థితిని చూసి ఆమె చలించిపోయారు. వివేక్ ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా.. కిడ్నీ మార్పిడి అనివార్యం.. కానీ, అంత డబ్బు లేక చికిత్స చేయించుకోని దుస్థితి.. ఈ విషయం తనకు తెలియడంతో చలించిపోయిన మంత్రి బిందు.. వెంటనే తన చేతికి ఉన్న బంగారు గాజులను తీసి.. బాధితుడికి అందజేశారు.. తాను ఉన్నానంటూ ధైర్యం చెబుతూ.. అతని చికిత్స ఖర్చుకు మొదటి విరాళంగా ఇచ్చింది అందరికీ ఆదర్శంగా నిలిచారు.
Read Also: Astrology: జూలై 12, మంగళవారం దినఫలాలు
ఇక, ఉన్నత విద్యారంగంలో సమూల మార్పులు తీసుకురావడానికి, దేశవ్యాప్తంగా విద్యార్థులను ఆకర్షించే కొత్త కోర్సులను ప్రవేశపెట్టేందుకు ఎన్నో ఆలోచనలు, పెట్టుబడులు, ప్రణాళికలు వేస్తున్నట్లు కేరళ విద్యాశాఖ మంత్రి ఆర్. బిందు ఇటీవలే వెల్లడించారు.. డాక్టర్ శ్యామ్ బి మీనన్ నేతృత్వంలోని ఏడుగురు సభ్యుల కమిషన్ సిఫార్సుల ఆధారంగా రాష్ట్రంలోని ఉన్నత విద్యా రంగం పాఠ్యాంశాల సవరణతో పూర్తి స్థాయిలో మార్పు చెందుతుందని బిందు చెప్పారు. ఓవైపు విద్యారంగం అభివృద్ధికి కృషి చేస్తున్న మంత్రి.. మరోవైపు ఓ రోగి పరిస్థితిని చూసి చలించిపోయి.. వెంటనే సాయం చేసి పలువురికి ఆదర్శంగా నిలిచారు మంత్రి బిందు. ఆమెపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.