Site icon NTV Telugu

Kerala: అదృష్టం అంటే ఈ చేపల వ్యాపారిదే.. బ్యాంకు నోటీసులు, అంతలోనే తగిలిన లాటరీ

Kerala Lottery

Kerala Lottery

Kerala Man Wins ₹ 70 Lakh Lottery: కేరళలో ఓ చేపల వ్యాపారికి భారీ లాటరీ తగిలింది. అక్టోబర్ 12ను అతను తన జీవితాంతం మరిచిపోలేడు. ఏకంగా రూ. 70 లక్షల లాటరీని గెలుచుకున్నాడు. అప్పుల బాధతో ఉన్న అతనిని లక్ష్మీ దేవి కరుణించింది. ఇందులో విశేషం ఏమిటంటే.. అతను తీసుకున్న అప్పు చెల్లించాలని బ్యాంకు నోటీసులు అందిన కొన్ని గంటల్లోనే అతను ఈ లాటరీని గెలుచుకున్నాడు.

వివరాల్లోకి వెళితే కేరళకు చెందిన నలబై ఏళ్ల పూకుంజు అదృష్టం కొద్దీ రూ. 70 లక్షల లాటరీని గెలుచుకున్నాడు. దీనికి ముందు పూకుంజు ఓ బ్యాంకు నుంచి రూ. 12 లక్షల రుణాన్ని తీసుకున్నాడు. అయితే అది చెల్లించకపోవడంతో అక్టోబర్ 12న సదరు బ్యాంకు అటాచ్మెంట్ నోటీసులు అందించింది. అయితే ఇది జరిగిన కొన్ని గంటల తరువాత అదే రోజు అక్షయ లాటరీలో మొదటి బహుమతి గెలుచుకున్నట్లు తెలిసింది. దీంతో పూకుంజు ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. తన రుణబాధలు అన్ని తీరుతున్నాయని ఆనందం వ్యక్తం చేశారు.

Read Also: Boora Narsaiah Goud Quit TRS: టీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌.. బీజేపీలోకి బూర నర్సయ్య గౌడ్‌..?

బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు బ్యాంకు నోటీసులు అందుకుంటే అదే రోజు 3 గంటలకు లాటరీని గెలుచుకున్నాడు పూకుంజు. ఉత్తర మైనాగపల్లి ప్రాంతానికి చెందిన పూకుంజు స్కూటర్ పై చేపలను విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నాడు. అయితే అతను తన ఇంటిని నిర్మించుకునేందుకు కార్పొరేషన్ బ్యాంక్ నుంచి రూ. 9 లక్షల రుణం తీసుకున్నాడు. దీనిని కట్టకపోవడంతో బ్యాంకు అధికారులు నోటీసులు పంపారు. నోటీసులు అందిన తర్వాత మేం నిరాశ చెందామని.. మా ఆస్తిని విక్రయించాలా వద్దా అనే ఆలోచనలో పడ్డట్లు, పూకుంజు భార్య వెల్లడించారు. బ్యాంక్ లోన్ తో పాటు లాటరీ టికెట్లు కొనుగోలు చేయడం ద్వారా రూ. 5 లక్షలు అప్పుచేసినట్లు పూకుంజు పిల్లలు తెలిపారు. లాటరీని గెలవడంపై ఆనందం వ్యక్తం చేసింది ఆ కుటుంబం. ఈ లాటరీ డబ్బులతో అప్పులన్నీ తీర్చి వేసి, పిల్లలకు మంచి చదువు అందిస్తామని పూకుంజు భార్య తెలిపారు.

Exit mobile version