Kerala Crime: దేశవ్యాప్తంగా ఏదో ఒక చోట ప్రతీ రోజు హత్యలు జరుగుతూనే ఉన్నాయి.. కొందరు చిన్న విషయాలకే హత్యలు చేస్తుండగా.. మరికొందరు వివాహేతర సంబంధాలకు కూడా బలి అవుతున్నారు.. ఇంకా కొందరు. ఇతర వ్యక్తులతో కలిసి.. కట్టుకున్న భర్తను.. పెళ్లి చేసుకున్న భార్యను కూడా కడతేర్చిన ఘటనలు ఈ మధ్య ఎన్నో వెలుగు చూశాయి.. ఇప్పుడు కేరళలో దారుణం చోటుచేసుకుంది.. భార్యను హతమార్చిన ఓ భర్త.. ఆ విషయాన్ని ఫేస్‌బుక్ లైవ్‌లో ప్రకటించిన ఘటన సంచలనంగా మారింది..
Read Also: Sand Mafia: ఇసుక మాఫియా దందాకు ఏడుగురు బలి..! రోడ్డున పడిన మూడు కుటుంబాలు..
కేరళలో జరిగిన ఓ హత్యకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కోల్లంకు చెందిన ఇసాక్.. గల్ఫ్ నుంచి తిరి గొచ్చి స్థానికంగా రబ్బర్ ట్యాపర్‌గా పనిచేస్తున్నాడు. అతడి భార్య శాలిని సమీపంలోని పాఠశాలలో సహాయకురాలిగా పనిచేస్తోంది. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు.. అయితే శాలినికి, ఇసాక్‌క మధ్య గత కొన్ని రోజులుగా గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో సోమవారం రోజు బాధితురాలు వంట గది వెనక ఉన్న పైపులైన్ వద్దకు స్నానానికి వెళ్ళిన సమయంలో ఇసాక్ ఆమెపై కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు.. కత్తితో శాలిని మెడ, ఛాతీ, వీపుపై తీవ్రమైన గాయాలు కావడంతో.. ఆమె మరణించింది. అనంతరం ఫేస్ బుక్ లో లైవ్ పెట్టి.. తన భార్యను హత్య చేసినట్లు ఇసాక్ వివరించాడు. శాలిని ఎప్పుడూ తన మాట వినలేదని, తన తల్లితోనే కలిసి నివసించడానికి వెళ్లిందని ఆరోపించాడు. భార్యను హత్య అనంతరం శాలిని భర్త ఇసాక్.. పునాలూర్ పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు. మృతురాలి కుమారుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
