NTV Telugu Site icon

Life Imprisonment: మైనర్ కుమార్తెపై అత్యాచారం.. తండ్రికి జీవిత ఖైదు..

Pocso Case

Pocso Case

Life Imprisonment: కామంతో కళ్లు మూసుకుపోయిన ఓ తండ్రి, తన కన్న కూతురిపై అమానుషంగా వ్యవహరించాడు. మైనర్ కుమార్తెపై పదేపదే అత్యాచారానికి పాల్పడ్డాడు. కేరళ రాష్ట్రంలో జరిగిన ఈ సంఘటనలో సదరు వ్యక్తికి కోర్టు 104 ఏళ్ల జైలు శిక్ష విధించింది. కేరళలోని అరీకోడ్‌కి చెందిన 41 ఏళ్ల వ్యక్తి తన మైనర్ కుమార్తెపై కొన్నేళ్లుగా అత్యాచారానికి పాల్పడుతున్నట్లు తేలింది. నిందితుడు తన భార్య, ఇద్దరు పిల్లలతో నివసించేవాడు. ఈ కేసులో పోక్సో చట్టం కింద నిందితుడు దోషిగా తేలింది. ఆ వ్యక్తికి జైలు శిక్షతో పాటు రూ. 1 లక్ష జరిమానా విధించారు. మంజేరీ ఫాస్ట్‌ట్రాక్ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ఎస్ రెస్మీ తీర్పు చెప్పారు.

Read Also: Video Viral : పట్టపగలే నడిరోడ్డుపై మత్తుమందు ఇచ్చి మహిళ కిడ్నాప్..

ఆరోగ్య సమస్యలపై కుమార్తె అరికోడు ఆస్పత్రికి తీసుకెళ్లిన సమయంలో ఈ నేరం బయటపడింది. తదుపరి చికిత్స కోసం కోజికోడ్ మెడికల్ కాలేజీకి రిఫర్ చేయగా, ఆమె గర్భవతి అని తెలిసింది. వైద్యులు గర్భస్రామం చేయాలని సలహా ఇచ్చారు. 17 ఏళ్ల కుమార్తెపై 10 ఏళ్లు నిండినప్పటి నుంచి 7 ఏళ్ల పాటు తండ్రి అత్యాచారానికి పాల్పడినట్లు తేలింది. ఈ కేసులో స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎఎస్ మనోజ్ 24 డాక్యుమెంట్ల సాక్ష్యాలను కోర్టు ముందు ఉంచారు. 22 మంది సాక్షులను విచారించారు. పోక్సో, అత్యాచార సెక్షన్ల కింద దోషిగా తేలడంతో అన్ని నేరాలకు కలిపి 104 ఏళ్ల శిక్ష విధించారు.