Kerala man sentenced to 142 years in jail for POCSO Case: మైనర్‌పై లైంగిక దాడికి పాల్పడిన ఓ వ్యక్తి కేరళలోని పోక్సో ప్రత్యేక న్యాయస్థానం 142 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. కేరళలోని పత్తినాంతిట్టకు చెందిన 41 ఏళ్ల వ్యక్తికి ఈ శిక్షను విధించింది. పదేళ్ల మైనర్ పిల్లవాడిపై రెండేళ్ల పాటు లైంగిక వేధింపులకు పాల్పడిన కేసులో కోర్టు సంచలన తీర్పు చెప్పింది. జైలు శిక్షతో పాటు రూ. 5 లక్షల జరిమానాను విధించింది. నిందితుడు ఒక వేళ రూ.5 లక్షల జరిమానాను చెల్లించకపోతే మరో మూడేళ్లు జైలు శిక్ష అదనంగా అనుభవించాల్సి వస్తుందని పోక్సో కోర్టు తీర్పు వెలువరించింది.
Read Also: YS Sharmila: అమ్మకు అన్నం పెట్టడు కానీ పిన్నమ్మకి బంగారు గాజులు చేయిస్తాడట.. కేసీఆర్‌పై ధ్వజం
ఆనందన్ పి.ఆర్ అలియాస్ బాబు అనే వ్యక్తి మైనర్ బాలుడిపై క్రూరంగా లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. తిరువల్లా పోలీసుల ప్రకారం 2019-2021 మధ్యకాలంలో 10 ఏళ్ల పిల్లవాడిపై అత్యాచారానికి పాల్పడినందుకు మార్చి 20, 2021న పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడు బాబు, బాధిత పిల్లాడి తల్లిదండ్రులకు బంధువు. వీరంతా ఒకే నివాసంలో ఉండేవారు. ఈ క్రమంలో పిల్లవాడిపై అత్యంత దారుణంగా రెండేళ్లుగా అత్యాచారానికి పాల్పడ్డాడు.
బాధితుల తరుపున పోక్సో ప్రాసిక్యూటర్ న్యాయవాది జాసన్ మాథ్యూస్ తన వాదనలను వినిపించారు. కేసులో నిందితుడికి వ్యతిరేకంగా బలమైన సాక్షాలను, వైద్య రికార్డులను ప్రాసిక్యూషన్ కోర్టుకు సమర్పించింది. ఈ కేసులో తిరువల్లా పోలీస్ అధికారి హరిలాల్ కేసును నమోదు చేసి, దర్యాప్తు నిర్వహించి ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. దీంతో కోర్టు నిందితుడికి 142 ఏళ్ల జైలు శిక్షతో పాటు రూ.5 లక్షల జరిమానాను విధించింది.