Site icon NTV Telugu

Kerala: భార్యను చంపి ఇంట్లోనే పాతేశాడు.. లేచిపోయిందని నాటకం.. చివరకు..

Kerala

Kerala

Kerala man murders wife, buries her at home in Ernakulam: కేరళకు చెందిన ఓ వ్యక్తి భార్యను చంపేసి ఏడాదిన్నరగా పోలీసులను తప్పుదోవపట్టిస్తూ వచ్చాడు. తన భార్య ఎవరితోనో పారిపోయిందని చెబుతూ ఇరుగుపొరుగు వారిని, బంధువులను చివరకు పోలీసులను మభ్యపెడుతూ వచ్చాడు. తన ఇంట్లోనే చంపి పాతిపెట్టాడు. చివరకు 18 నెలల తర్వాత హత్య విషయం వెలుగులోకి వచ్చింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఎర్నాకులంకు చెందిన సజీవ్ భార్య రమ్య ఆగస్ట్, 2021 నుంచి కనిపించకుండా పోయింది. ఫిబ్రవరి 2022లో ఎన్ జరక్కల్ పోలీసులకు మిస్సింగ్ కంప్లైట్ ఇచ్చాడు.

Read Also: Taslima Nasreen: రాఖీ సావంత్‌కే తప్పలేదు..ఇస్లాంపై బంగ్లాదేశీ రచయిత్రి వ్యాఖ్యలు..

అయితే స్పెషల్ పోలీస్ టీం శాస్త్రీయ విచారణ జరిపి సజీవ్ ను నిందితుడని కనుక్కున్నారు. భార్యను చంపి ఇంటి ఆవరణలో పాతేసినట్లు పోలీస్ విచారణలో తేలింది. అయితే హత్య చేసిన తర్వాత తనకు ఏం తెలియనట్లు నటిస్తూ వచ్చాడు. అయితే అతడి కదలికను పరిశీలించేందుకు అతనిపై నిఘా పెట్టారు పోలీసులు. ఏడాది పాటు నిఘా ఉంచి విచారణ జరిపిన తర్వాత సాక్ష్యాలు సేకరించి అరెస్ట్ చేశారు. ప్రాథమిక సమాచారం ప్రకారం ఫోన్ కాల్స్ విషయంలో గొడవ ఈ హత్యకు కారణం అయింది.

ఇంటి ఆవరణలో పాతిపెట్టిన తర్వాత ఏడాదిన్నర పాటు అదే ఇంట్లోనే ఉన్నాడు నిందితుడు సీజీవ్. తన భార్య వేరేవారితో లేచిపోయిందని బంధువులను, స్థానికులను నమ్మించాడు. చివరకు రెండో పెళ్లికి కూడా సిద్ధం అయ్యాడు. పోలీసులు జరిపిన విచారణలో ఇంటికి సమీపంలో భార్య రమ్య శవం అవశేషాలను కనుక్కున్నారు. హత్య, సాక్ష్యాలను నాశనం చేసినందుకు సంబంధిత సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేశారు.

Exit mobile version