NTV Telugu Site icon

Sudan: సూడాన్ ఘర్షణల్లో 61 మంది మృతి.. మృతుల్లో కేరళ వాసి

Sudan

Sudan

Sudan: ఆఫ్రికా దేశం సూడాన్ లో అంతర్యుద్ధం ముదురుతోంది. సైన్యం, పారామిలిటరీ మధ్య తగాదాలు తారాస్థాయికి చేరాయి. సైన్యంలో పారామిలిటీరిన విలీనం చేసేందుకు సైన్యాధ్యక్షుడు ప్రతిపాదించడంతో, పారామిలిటీరి కమాండర్ దీనికి ఒప్పుకోకపోవడంతో ఇరు వర్గాల మధ్య తీవ్రహింస చెలరేగింది. రాజధాని ఖార్టూమ్ తో పాటు ఇతర ప్రాంతాలకు కూడా ఘర్షణలు పాకాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే సూడాన్ లోని భారతీయ రాయబార కార్యాలయం భారతీయులందరికి సూచనలు జారీ చేసింది. అందరూ ఇళ్లకే పరిమితం కావాలని సూచించింది.

Read Also: Award Function : విషాదంగా అవార్డుల వేడుక.. వడదెబ్బతో 11మంది మృతి

ఇదిలా ఉంటే ఖార్టూమ్ లో జరిగిన దాడుల్లో కేరళ వాసి మరణించినట్లు కేంద్ర ప్రభుత్వం ఆదివారం తెలిపింది. కేరళలోని కన్నూర్ జిల్లాకు చెందిన ఆల్బర్ట్ అగెస్తీన్ కుటుంబానికి అవసరమైన అన్ని సహాయాన్ని అందజేస్తామని, అతని మృతదేహాన్ని దేశానికి తీసుకురావడానికి చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి వి మురళీధరన్ తెలిపారు. బాధితుడి తండ్రితో కూడా మంత్రి మాట్లాడినట్లు ప్రభుత్వం ప్రకటించింది.

అగెస్తీన్ బుల్లెట్ గాయాలతో చనిపోగా అతని భార్య, కుమార్తె క్షేమంగా ఉన్నారని రాయబార కార్యాలయం తెలిపింది. కెనడాలో ఉన్న తన కుమారుడితో మాట్లాడుతున్న సమయంలో అగెస్తీన్ బుల్లెట్ గాయాలయ్యాని కేరళలోని అతని బంధువులు తెలిపారు. ఈ ఘటన జరిగినప్పుడు అతను తన ఇంట్లోనే ఉన్నాడని తెలిపారు. సుడాన్‌లోని దాల్‌ గ్రూప్‌ కంపెనీలో అగెస్టీన్‌ పనిచేస్తున్నాడు. కేరళ పీసీసీ చీఫ్ కే సుధాకరన్ విదేశాంగ మంత్రికి లేఖ రాశారు. అగస్తీన్ మృతదేహాన్ని త్వరగా భారత్ తీసుకువచ్చేలా చూడాలని కోరారు. ప్రస్తుతం అధికార లెక్కల ప్రకారం సూడాన్ దేశంలో 4000 మంది భారతీయులు ఉన్నారు. వీరిలో దశాబ్ధాల క్రితం దేశంలో స్థిరపడిన వారు 1200 మంది ఉన్నారు. అక్టోబర్ 2021లో జరిగిన తిరుగుబాటులో సైన్యం అధికారాన్ని చేజిక్కించుకుంది. ప్రభుత్వాన్ని మళ్లీ ప్రజాస్వామ్యం వైపు తీసుకుని వెళ్లే క్రమంలో చర్చల్లో భాగంగా సైన్యం, పారామిలిటరీల మధ్య వివాదం రాజుకుంది.