Kerala High Court: మహిళా హక్కుల కార్యకర్త రెహానా ఫాతిమాపై నమోదైన పోక్సో కేసును కేరళ హైకోర్టు కొట్టివేసింది. మహిళల నగ్న శరీరంపై బొమ్మలు వేయడం అన్ని సందర్భాల్లోనూ అశ్లీలంగా, లైంగికంగా భావించరాదని కోర్టు పేర్కొంది. తల్లి తన శరీరాన్ని కాన్వాస్‌గా మార్చుకుని తన పిల్లలకు రంగులు వేయడంలో తప్పేమీ లేదన్నారు. ఆడ, మగ శరీరాలను, నగ్నత్వాన్ని వేర్వేరుగా చూడటం తప్పుపట్టింది. పులికాలి, తెయ్యం వంటి సంప్రదాయ వేడుకల్లో పురుషులపై దేహాన్ని చిత్రించడాన్ని సమాజం అంగీకరిస్తుందని వ్యాఖ్యానించారు. మహిళ నగ్న శరీరాన్ని లైంగిక వస్తువుగా చూడటం సరికాదన్నారు.
ఇది జూన్ 2000 నాటి సంఘటన. రెహానా ఫాతిమాకు ఇద్దరు పిల్లలు. కొడుకు, కూతురు ఉన్నారు. రెహానా ఫాతిమా తన కొడుకు 12 ఏళ్లలోపు, 14 ఏళ్ల కుమార్తెతో బాడీ పెయింట్ వేయించుకుంది. ఆమె కొడుకు,కుమార్తె టాప్‌లెస్ శరీరంపై పెయింట్ వేస్తున్న దృశ్యాలు వీడియోలో రికార్డ్ చేసిన రెహానా.. దాన్ని యూట్యూబ్‌లో పోస్ట్ చేశారు. 19 నిమిషాలకు పైగా నిడివి ఉన్న ఈ వీడియో కేరళలో కలకలం రేపింది. ఏడీ బాడీ ఆర్ట్స్ అండ్ పాలిటిక్స్ పేరుతో ఆమె యూట్యూబ్ లో పోస్ట్ చేసిన ఈ వీడియో సంచలనంగా మారింది. ఈ వీడియో చూసిన ఓబీసీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏవీ అరుణ్ ప్రకాశ్ ఆమెపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అతని ఫిర్యాదు మేరకు తిరువళ్ల పోలీసులు కేసు నమోదు చేశారు. పోక్సో, ఐటీ యాక్ట్, జువైనల్ జస్టిస్ యాక్ట్ కింద కేసులు నమోదు చేశారు. అయితే వాటన్నింటినీ హైకోర్టు కొట్టివేసింది.శబరిమలలోకి మహిళలను అనుమతించాలంటూ ఉద్యమం జరుగుతున్న సమయంలోనూ రెహానాపై పలు కేసులు నమోదయ్యాయి. బిందు, కనకదుర్గతో పాటు రెహానా ఫాతిమా శబరిమల ఆలయంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించారు. మత విద్వేషాలను రెచ్చగొట్టారనే ఆరోపణలపై కేసులు పెట్టారు. ఆ సమయంలో ఆమె ఇంటిపై మలయాళీలు రాళ్లతో దాడి చేశారు. కుటుంబ సభ్యులు కూడా ఆమెను బయటకు గెంటేశారు.
Ntr : సొంతంగా నిర్మాణ సంస్థ మొదలు పెట్టబోతున్న ఎన్టీఆర్..?