NTV Telugu Site icon

Transgender Lawyer: కేరళలో ఫస్ట్ ట్రాన్స్ జెండర్ లాయర్‌గా పద్మా లక్ష్మీ..

Padma Laskshmi

Padma Laskshmi

Kerala First Transgender Lawyer: కేరళలో మొదటి జెండర్ న్యాయవాదిగా పద్మాలక్ష్మీ చరిత్ర సృష్టించారు. కేరళ రాష్ట్ర బార్ కౌన్సిల్ లో లాయర్ గా తమ పేరును నమోదు చేయించుకున్నారు. దీనిపై కేరళ మంత్రి పీ రాజీవ్ స్పందించారు. అనేక మంది ట్రాన్స్ జంటర్లకు పద్మాలక్ష్మీ ప్రేరణగా నిలుస్తారని ఆయన అన్నారు. మంత్రి ఇన్‌స్టాగ్రామ్‌లో అకౌంట్ లో పద్మాలక్ష్మీని అభినందిస్తూ పోస్ట్ చేశారు. బార్ ఎన్‌రోల్‌మెంట్ సర్టిఫికేట్ కోసం బార్ కౌన్సిల్ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న 1500 మందిలో పద్మాలక్ష్మీ కూడా ఒకరని ఆయన అన్నారు. పద్మా లక్ష్మి ఎర్నాకులం ప్రభుత్వ న్యాయ కళాశాలలో పట్టభద్రురాలయ్యారు. లాయర్ కావడానికి పద్మాలక్ష్మీ ప్రయత్నాలను మంత్రి ప్రశంసించారు.

Read Also: CJI D.Y. Chandrachud: లివ్-ఇన్ రిలేషన్ షిప్‌పై పిల్.. సీజేఐ తీవ్ర ఆగ్రహం..

జీవితంలో ఎదురైన అన్ని అడ్డంకులను అధిగమించి కేరళలో మొదటి ట్రాన్స్‌జెండర్ న్యాయవాదిగా నమోదు చేసుకున్న పద్మాలక్ష్మికి అభినందనలు తెలియజేశారు. ఎన్నొ అడ్డంకులు అధిగమించి పద్మా లక్ష్మి న్యాయ చరిత్రలో తన పేరును లిఖించుకుంది అని మంత్రి రాజీవ్ సోషల్ మీడియాలో ప్రశంసించారు. అడ్వకేట్ కమ్యూనిటీకి అభినందనలు, స్వాగతం అంటూ పోస్ట్ లో వ్యాఖ్యానించారు.

భారతదేశంలో మొట్టమొదటి ట్రాన్స్‌జెండర్ జడ్జిగా మారిన జోయితా మోండల్ లాగే పద్మాలక్ష్మీ ఘనత సాధించారు. సోషల్ మీడియా ద్వారా నెటిజన్లు ఆమెను ప్రశంసించారు. జోెయితా మోండల్ 2017లో పశ్చిమ బెంగాల్ ఇస్లాంపూర్ లోక్ అదాలత్ లో న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2018లో ట్రాన్స్ జెండర్ కార్యకర్త విద్యా కాంబ్లే మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో లోక్ అదాలత్‌లో జడ్జిగా నియమితులయ్యారు. ఆ తరువాత ఏడాది దేశంలో మూడో ట్రాన్స్ జెండర్ న్యాయమూర్తిగా స్వాతి బిధాన్ బారుహ్ నియమితులయ్యారు.