NTV Telugu Site icon

Smartwatch Saves Life: “స్మార్ట్‌వాచ్” ఉపయోగించి విమానంలో మహిళ ప్రాణాలు కాపాడిన డాక్టర్..

Air India

Air India

Smartwatch: ఇటీవల కాలంలో స్మార్ట్‌వాచ్‌లు మనుషులు ప్రాణాలు కాపాడుతుున్నాయి. గుండెపోటు, బీపీ ఎక్కువ కావడం వంటి వాటిని ముందే గమనించి, అలర్ట్ చేస్తున్నాయి. ఇదిలా ఉంటే విమానంలో ఓ మహిళ ప్రాణాలను స్మార్ట్ వాచ్ కాపాడింది. ఢిల్లీ-శాన్‌ఫ్రాన్సిస్కో ఎయిర్ ఇండియా విమానంలో అనారోగ్యానికి గురైన మహిళలను ఓ కేరళ డాక్టర్ కాపాడారు. ఆపిల్ వాచ్ సహాయంతో 56 ఏళ్ల మహిళకు ట్రీట్మెంట్ ఇచ్చారు. విమానంలో ప్రయాణిస్తున్న మహిళ అస్వస్థతకు గురై, తల తిరగడం వంటి లక్షణాలను ఎదుర్కొంది. ఈ ఘటన జూలై 2న జరిగింది.

Read Also: JK: జమ్మూకశ్మీర్ లో కొనసాగుతున్న ఎన్ కౌంటర్..నలుగురు ఉగ్రవాదుల హతం

కేరళలోని రాజగిరి హాస్పిటల్ మెడికల్ డైరెక్టర్ కురుత్తుకులం అస్వస్థతకు గురైన మహిళని రక్షించారు. ఆ సమయంలో డాక్టర్ వద్ద సరైన పరికరాలు లేకపోవడంతో, ఆమె చేతికి ఉన్న ఆపిల్ స్మార్ట్‌వాచ్‌ని ఉపయోగించి గుండె చప్పుడు, ఆక్సిజన్ సాచురేషన్ స్థితులను పర్యవేక్షించారు. వాచ్ సాయంతో ఎలక్ట్రో కార్డియోగ్రామ్ పరీక్షను నిర్వహించారు. మహిళ ఆక్సిజన్ సాచురేషన్ తక్కువగా ఉందని, బీపీ ఎక్కువగా ఉన్నట్లు గమనించి ఫ్లైట్ మెడికల్ కిట్‌లో అందుబాటులో ఉన్న ఇంజెక్షన్ల సాయంతో ట్రీట్మెంట్ ఇచ్చారు. మహిళ పరిస్థితిని చూసి, కెప్టెన్ విమానాన్ని సమీపంలోని విమానాశ్రయానికి మళ్లించాలని భావించారు. అయితే డాక్టర్ కురుత్తుకులం సదరు మహిళ పరిస్థితి స్థిరంగానే ఉందని చెప్పారు. శాన్‌ప్రాన్సిస్కో ఎయిర్ పోర్టు చేరుకున్న తర్వాత ఆమెను ఆస్పత్రికి తరలించారు.