దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కరోనా కేసులు తగ్గుతూ వచ్చినా.. కేరళలో మాత్రం భారీగానే పాజిటివ్ కేసులు వెలుగు చూస్తూ వచ్చాయి.. ఇప్పుడు మరోసారి భారీ స్థాయిలో కొత్త కేసులు వెలుగు చూవాయి.. కేరళ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. ఆ రాష్ట్రంలో గత 24 గంటల్లో 31,445 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. మరో 215 మంది కరోనా బాధితులు మృతిచెందారు. ఆ రాష్ట్రంలో పాజిటివిటీ రేటు 19.03గా నమోదైంది.. మళ్లీ కోవిడ్ కేసులు పెరగడానికి ఇటీవల జరిగిన ఓనమ్ పండుగే కారణమని చెబుతున్నారు.. తాజా కేసులతో కలుపుకొని.. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 38,83,429కి చేరింది. మృతుల సంఖ్య 19,972కి పెరిగింది.
కేరళలో మళ్లీ పెరిగిన కోవిడ్ కేసులు.. 31 వేలకు పైగా కొత్త కేసులు

COVID 19