Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Kerala Congress Cm Race Kc Venugopal Vd Satheesan Ramesh Chennithala

Keralam: తమిళనాడు పోయి.. కేరళం వచ్చే.. కేసీ వర్సెస్ సతీశన్ పంచాయితీ తెగేనా?

Published Date :May 11, 2026 , 7:22 pm
By Suresh Maddala
  • తమిళనాడు పోయి.. కేరళం వచ్చే
  • కేసీ వర్సెస్ సతీశన్‌గా మారిన కేరళం పంచాయితీ
  • సీఎం ఎంపికపై హైకమాండ్ తర్జన భర్జన
Keralam: తమిళనాడు పోయి.. కేరళం వచ్చే.. కేసీ వర్సెస్ సతీశన్ పంచాయితీ తెగేనా?
  • Follow Us :
  • google news
  • google preferred source icon Add as a preferred
    source on google

ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు మే 4న విడుదలయ్యాయి. తమిళనాడు, కేరళం, పుదుచ్చేరి, పశ్చిమ బెంగాల్, అస్సోం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చేశాయి. ఒక్క తమిళనాడు మినహా మిగతా రాష్ట్రాల్లో స్పష్టమైన ఫలితాలు వచ్చేశాయి. తమిళనాడులో హంగ్ ఏర్పడడంతో ఐదు రోజులు తర్జన భర్జన తర్వాత విజయ్ నేతృత్వంలోని టీవీకే అధికారంలోకి వచ్చింది.

ఇక కేరళంలో కూడా స్పష్టమైన ఫలితం వచ్చింది. కాంగ్రెస్ నేతృత్వంలోని కూటమి మెజార్టీ సాధించింది. కానీ ఇప్పటి వరకు ప్రభుత్వం ఏర్పడ లేదు. వారం రోజులు గడుస్తున్నా.. ముఖ్యమంత్రి అభ్యర్థిత్వం ఇప్పటి వరకు తేల్చలేకపోయింది. ముగ్గురు వ్యక్తుల మధ్య నువ్వానేనా? అన్నట్టుగా ఫైటింగ్ సాగుతోంది. దీంతో హైకమాండ్ ఎటూ తేల్చుకోలేకపోతుంది. దీంతో ఈ సంక్షోభం మరిన్ని రోజులు కొనసాగేటట్టు కనిపిస్తోంది.

Also Read

  • Tamilnadu: చీలిక దిశగా ఏఐఏడీఎంకే.. ఎమ్మెల్యేల తిరుగుబావుటా తప్పదా! కారణమిదేనా?
  • Maharashtra: మోడీ పిలుపు.. ఫడ్నవిస్ అమలు.. ఇకపై ఈ-వాహనాలే వినియోగించాలని ఆదేశాలు
  • Bengal: సీఎం సువేందు తొలి కేబినెట్ భేటీ.. పలు కీలక నిర్ణయాలకు ఆమోదం
  • TMC Internal Crisis: దీదీ కోటలో చిచ్చు.. టీఎంసీలో సీనియర్ల తిరుగుబాటు! ఇక పార్టీ ముక్కలైనట్లేనా?
Add as a preferred
source on google

ప్రముఖంగా కేరళం ముఖ్యమంత్రి రేసులో ముగ్గురి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.
కేసీ వేణుగోపాల్‌తో పాటు సతీశన్, రమేష్ చెన్నితాల పేర్లు వినిపిస్తున్నాయి. కేసీ వేణుగోపాల్.. రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితుడు. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కూడా ఉన్నారు. గత 2021 అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే వేణుగోపాల్‌ను ముఖ్యమంత్రిని చేయవచ్చనే అంతర్గత చర్చలు జరిగాయి. అయితే కేరళలో ప్రతి ఐదేళ్లకు ప్రభుత్వాలు మారే సంప్రదాయానికి బ్రేక్ పడింది. లెఫ్ట్ ఫ్రంట్ తిరిగి అధికారంలోకి వచ్చింది. ఇక వేణుగోపాల్ గత, ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనప్పటికీ.. ఆయనకున్న రాజకీయ పలుకుబడి దృష్ట్యా.. తాజా ఫలితాలను బట్టి ఆయనను ముఖ్యమంత్రి పదవికి సహజ పోటీదారుగా పరిగణించారు.

ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రిపై కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల అభిప్రాయాన్ని తెలుసుకోవడానికి పార్టీ నాయకత్వం నియమించిన పరిశీలకులు అజయ్ మాకెన్, ముకుల్ వాస్నిక్ గురువారం తిరువనంతపురానికి చేరుకున్నప్పుడు… 63 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో అత్యధికులు వేణుగోపాల్ పేరును సూచించారు. ఎమ్మెల్యేలే కాకుండా.. కేరళకు చెందిన కాంగ్రెస్ ఎంపీలు, ఇతర సీనియర్ నాయకులు కూడా వేణుగోపాల్‌కు పగ్గాలు అప్పగించాలని సూచించారు. కానీ ఇంతలోనే ఇటీవల కాలంలో ప్రజాదరణ పొందిన ప్రతిపక్ష నాయకుడిగా ఎదిగిన సతీశన్ పేరు కూడా లైన్‌లోకి వచ్చింది. సతీశన్‌కు ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పగించాలని మిత్రపక్షమైన ఐయూఎంఎల్ డిమాండ్ చేసింది. దీంతో ఎలాగైనా సీఎం పదవి దక్కించుకోవాలని గట్టి పట్టుదలతో ఉన్నారు.

మరోవైపు రమేష్ చెన్నితాల కూడా తన సీనియారిటీ ఆధారంగా ముఖ్యమంత్రి పదవిపై ఆశ పెట్టుకున్నారు. తనకు ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఇలా ముగ్గురి మధ్య పోటీ నెలకొంది. అయితే ఫలితాలు వేణుగోపాల్‌కు అనుకూలంగా ఉన్నాయని తెలియగానే. కేరళలోని సతీషన్ మద్దతుదారులు సోషల్ మీడియా నుంచి క్షేత్రస్థాయి వరకు ప్రచారాన్ని ప్రారంభించాయి. కేరళ వ్యాప్తంగా నిరసనలు చేపట్టారు. దీంతో హైకమాండ్ సందిగ్ధంలో పడింది. ఎవరిని కేరళం ముఖ్యమంత్రిగా నియమించాలన్న దానిపై అధిష్టానం తర్జన భర్జన పడుతోంది. ఘర్షణలు తలెత్తకుండా చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సీఎం ఎంపిక మరింత ఆలస్యం అయ్యేటట్టు కనిపిస్తోంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Congress High Command
  • Congress Kerala news
  • India political news
  • IUML
  • KC Venugopal

తాజావార్తలు

  • Keralam: తమిళనాడు పోయి.. కేరళం వచ్చే.. కేసీ వర్సెస్ సతీశన్ పంచాయితీ తెగేనా?

  • Vijay: పాపం విజయ్… రచ్చ గెలిచి ఇంట గెల్వలేకపోయాడా??

  • Nimmala Ramanaidu : 2027 జూన్ కి పోలవరం ప్రాజెక్టు పూర్తి

  • Sreemukhi : ముచ్చటగా మూడో ఇల్లు కొనేసిన శ్రీముఖి

  • Madatha Kaja Recipe : స్వీట్ షాప్ స్టైల్‌లో జ్యూసీ మడత కాజాలు ఇంట్లోనే సులభంగా ఇలా తయారు చేసుకోండిలా.!

ట్రెండింగ్‌

  • 204HP పవర్, ADAS ఫీచర్లతో 2026 Skoda Kodiaq భారత్ లో లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..

  • Ginger Candy: తాటి బెల్లం + అల్లం: గొంతు నొప్పి నుండి జీర్ణ సమస్యలకు.. చెక్ పెట్టే అద్భుత ఔషధం ‘అల్లం మురబ్బా’ ఇంట్లోనే చేసుకోండి ఇలా..

  • 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్‌ప్లే, యాక్టివ్ కూలింగ్‌తో గేమింగ్ మాన్స్టర్.. REDMAGIC 11S Pro రాక!

  • PM Modi: ఆడంబరాలు వద్దు.. పొదుపు ముద్దు.! దేశాభివృద్ధి కోసం ప్రధాని 10 కీలక సూచనలు..

  • Kathmandu: రన్‌వేపై మంటల్లో చిక్కుకున్న విమానం.. 278 మంది ప్రయాణికులు.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions