NTV Telugu Site icon

Kerala Floods: అమిత్ షా వ్యాఖ్యలను తోసిపుచ్చిన సీఎం పినరయి

Pinarayivijayan

Pinarayivijayan

వయనాడ్ విలయంపై వారం రోజుల క్రితమే కేరళ ప్రభుత్వాన్ని హెచ్చరించామంటూ రాజ్యసభలో కేంద్రమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలను ముఖ్యమంత్రి పినరయి విజయన్ తోసిపుచ్చారు. విపత్తుకు ముందు కేంద్రం వయనాడ్‌కు ఎలాంటి రెడ్‌ అలర్ట్‌ ప్రకటించలేదని తేల్చిచెప్పారు. తమకు ఎలాంటి అలర్ట్‌ జారీ చేయలేదని పేర్కొన్నారు.

విపత్తుకు ముందు కేంద్రం వయనాడ్‌కు రెడ్‌ అలర్ట్‌ ప్రకటించలేదని పినరాయి అన్నారు. అధికారులు హెచ్చరిక జారీ చేయడానికి ముందే కొండచరియలు విరిగిపడ్డాయని చెప్పారు. అయినా ఒకరిపై ఒకరు నిందలు వేసుకునేందుకు ఇది సమయం కూడా కాదని పేర్కొన్నారు. ప్రజలు కష్టాల్లో ఉన్నారని.. వారి సమస్యను పరిష్కరించడంపై దృష్టి పెట్టాలని కేంద్రానికి సీఎం హితవు పలికారు.

ప్రకృతి విపత్తు గురించి జులై 23నే తెలియజేసి రాష్ట్రాన్ని అప్రమత్తం చేశామని.. అయినా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించలేదని అమిత్‌ షా బుధవారం రాజ్యసభలో ప్రకటించారు. తక్షణమే అప్రమత్తమై ఉంటే ప్రాణనష్టం తగ్గి ఉండేదన్నారు. ఆయన చేసిన ప్రకటనపై తాజా సీఎం స్పందిస్తూ కొట్టిపారేశారు.

వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడిన ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని సీఎం పినరయి విజయన్‌ తెలిపారు. ఇప్పటివరకు 144 మృతదేహాలను వెలికితీశారని.. 191 మంది ఆచూకీ గుర్తించలేదని తెలిపారు. 5,500 మందిని రక్షించినట్లు వెల్లడించారు. 8 వేల మందికి పైగా బాధితులను 82 శిబిరాలకు తరలించినట్లు పేర్కొన్నారు.