Site icon NTV Telugu

Kerala: తొలి పేదరిక రహిత రాష్ట్రంగా కేరళ.. ప్రకటించిన సీఎం పినరయి

Kerala

Kerala

కేరళ సరికొత్త చరిత్రను సృష్టించింది. దేశంలోనే తొలి పేదరికం లేని రాష్ట్రంగా అవతరించింది. ఈ మేరకు కేరళ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా అసెంబ్లీలో ముఖ్యమంత్రి పినరయి విజయన్ శనివారం ప్రకటించారు. భారతదేశంలోనే పేదరికాన్ని నిర్మూలించిన మొదటి రాష్ట్రంగా కేరళ నిలిచిందని వెల్లడించారు.

ఇది కూడా చదవండి: Nitish Kumar: నిజాయితీగా సేవ చేశా.. మరొక అవకాశం ఇవ్వాలని నితీష్ వీడియో సందేశం

2021లో పేదరిక నిర్మూలన ప్రాజెక్ట్‌ను పినరాయి విజయన్ ప్రభుత్వ చేపట్టింది. మొట్టమొదటిగా ఆశా కార్యకర్తలు, స్థానిక ప్రతినిధులతో రాష్ట్రమంతా సర్వే చేయించారు. దీంతో 64,006 కుటుంబాలు అత్యంత పేద కుటుంబాలుగా గుర్తింపబడ్డారు. అనంతరం పేదల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టింది. ఉచితంగా నగదు రహిత చికిత్సలు చేపట్టింది. అలాగే పేదలందరికీ ఉచితంగా ఇళ్ల స్థలాలు కేటాయించింది. అంతేకాకుండా వాళ్లందరికీ జీవనోపాధి కార్యక్రమాలు చేపట్టింది. సామాజిక సంక్షేమానికి మద్దతుగా అనేక సహాయ సహకారాలు అందించింది. ఈ కార్యక్రమాలన్నీ నేరుగా ముఖ్యమంత్రి కార్యాలయమే పర్యవేక్షించే విధంగా ఏర్పాట్లు చేసింది. దీంతో ఆరోగ్యం, రవాణా, ఆదాయం వంటి కార్యక్రమాలను బహుళ విభాగాలతో సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్లింది. దీంతో అన్ని విషయాల్లో సత్‌ఫలితాలు వెలువడ్డాయి.

ఇది కూడా చదవండి: Gold Rates: పసిడి ప్రియులకు శుభవార్త.. ఈరోజు ఎంత తగ్గిందంటే..!

ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం 2023–24 ఆర్థిక సంవత్సరంలో రూ. 80 కోట్లు, 2024–25 ఆర్థిక సంవత్సరంలో రూ. 50 కోట్లు ఖర్చు చేసింది. దీంతో గృహనిర్మాణం, ఆరోగ్య సంరక్షణ, జీవనోపాధి ప్రజలకు సంపూర్ణంగా చేరువైంది. దీంతో వారంతా పేదరికాన్ని బయటపడ్డారు. దీంతో పేద రహిత రాష్ట్రంగా కేరళ అవతరించింది.

పురోగతి ఇదే..
3,913 ఇళ్లు నిర్మించారు.
1,338 కుటుంబాలకు భూమి ఇచ్చారు.
5,651 కుటుంబాలకు ఇళ్ల మరమ్మతుల కోసం ఒక్కొక్కరికి రూ.2 లక్షలు అందించారు.
21,263 మందికి రేషన్ కార్డులు, ముఖ్యమైన పత్రాలను అందించారు.

ఇదిలా ఉంటే కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్షాలు పినరయి విజయన్‌ ప్రకటనను తోసిపుచ్చాయి. ప్రభుత్వం తప్పుడు ప్రకటనలతో ప్రజలను మోసం చేస్తున్నారంటూ ధ్వజమెత్తాయి. ప్రతిపక్ష నేత సతీశన్ అసెంబ్లీలో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి చేసిన ప్రకటన భారీ మోసం అని విమర్శించారు. ప్రభుత్వ ప్రకటనను వ్యతిరేకిస్తూ ప్రతిపక్ష నేతలు సభ నుంచి వాకౌట్‌ చేశారు.

Exit mobile version