Site icon NTV Telugu

Dogs Attack: ఐదేళ్ల బాలుడిపై వీధికుక్కల దాడి..

Kerala

Kerala

Dog Attack: వీధికుక్కల దాడులు దేశంలో ఎక్కువ జరుగుతున్నాయి. తెలంగాణతో పాటు దేశంలోని పలు రాష్ట్రాల్లో ఈ ఘటనలు నమోదయ్యాయి. వీధికుక్కల దాడుల్లో చిన్నారు, పెద్ద వయసు ఉన్న వారు మరణిస్తున్నారు. వీరే ఈజీగా వాటికి టార్గెట్ అవుతున్నారు. ఇదిలా ఉంటే కేరళ రాష్ట్రంలో నీలంబూర్ లో మంగళవారం ఐదేళ్ల బాలుడిపై వీధి కుక్కలు దాడి చేశాయి. ఎల్‌కేజీ చదువుతున్న పిల్లాడు స్కూల్ నుంచి ఇంటికి తిరిగి వస్తుందగా మూడు వీధికుక్కలు దాడి చేశాయి.

Read Also: Upasana : తన బిడ్డ కోసం ఉపాసన చేస్తున్న ఆ పనికి ప్రశంసిస్తున్న నెటిజన్స్..!!

సయన్ మహ్మద్ అనే ఐదేళ్ల పిల్లాడిపై కుక్కలు దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డాడు. తన ఇంటికి కేవలం 50 మీటర్ల దూరంలోని ఈ ఘటన జరిగింది. సమీపంలో ఫుట్ బాల్ ఆడుతున్న స్థానికులు గమనించి కుక్కల నుంచి చిన్నారిని రక్షించే ప్రయత్నం చేశారు. సకాలంలో స్థానికులు స్పందించడంతో పిల్లాడు ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ దాడిలో సయన్ ముఖంతో పాటు ఇతర ప్రాంతాల్లో తీవ్ర గాయాలు అయ్యాయి. చిన్నారిని తొలుత నిలంబూర్ జిల్లా ఆస్పత్రిలో చేర్పించారు. గాయానికి సంబంధించిన మందులు అక్కడ అందుబాటులో లేకపోవడంతో మంజేరి మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం పిల్లాడి పరిస్థితి నిలకడగా ఉందని, చికిత్స తీసుకుంటున్నట్లు అధికారులు వెల్లడించారు.

కేరళలో గత ఏడాది కాలంగా కుక్కల దాడులు అధికం అవుతున్నాయి. పలువురు చిన్నారులు ఈ ఘటనల్లో ప్రాణాలు కోల్పోయారు. జూన్ 11న నిలంబూరులోని కేటీడీసీ హోటల్ సమీపంలో ఓ జింకపై వీధికుక్కలు దాడి చేసి చంపాయి. జూన్ 11 న, కేరళలోని కన్నూర్ సమీపంలోని ముజప్పిలంగాడ్ వద్ద తన ఇంటి వెలుపల వీధికుక్కల గుంపు దాడి చేయడంతో ప్రత్యేక అవసరాలు గల 11 ఏళ్ల బాలుడు నిహాల్ మరణించాడు. జూన్ 12న, త్రిసూర్‌లో ఒక మహిళ మరియు ఆమె కుమార్తె షాపింగ్ చేయడానికి బయలుదేరినప్పుడు వీధి కుక్కలు వారిపై దాడి చేశాయి.

Exit mobile version