NTV Telugu Site icon

Kedarnath: తెరచుకున్న కేదార్‌నాథ్.. భక్తుల పులకింత..

Kedarnath

Kedarnath

ప్రముఖ శైవక్షేత్రం కేదార్‌నాథ్ ఆలయం ఇవాళ తెరుచుకుంది.. కోవిడ్-19 నిబంధనలు పాటిస్తూ భక్తులకు దర్శనాలు కల్పించనున్నట్టు అధికారులు తెలిపారు.. ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన కేదార్‌నాథ్‌ ఆలయాన్ని ఇవాళ ఉదయం 6.26 గంటలకు వేద మంత్రోచ్ఛారణలు, శివనామ స్మరణమధ్య ఆలయ ద్వారాలు తెరుచుకున్నాయి.. దీంతో, భక్తులు తన్మయతంలో పులకించిపోయారు. ఈ పవిత్రోత్సవాన్ని తిలకించారు ఉత్తరాఖండ్‌ సీఎం పుష్కర్‌సింగ్‌ ధామి, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

Read Also: Movie Tickets: ఆన్‌లైన్‌లో సినిమా టికెట్ల విక్రయం.. హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్

ఇక, అంతకుముందు, మే 3న, అక్షయ తృతీయ సందర్భంగా గంగోత్రి మరియు యమునోత్రి యొక్క పోర్టల్స్ తెరవబడ్డాయి, ఇది చార్ ధామ్ యాత్ర 2022 ప్రారంభాన్ని కూడా సూచిస్తుంది… భక్తుల కోసం ఆలయ తలుపులు తెరవడానికి కొన్ని గంటల ముందు, సీఎం పుష్కర్‌ సింగ్‌ ధామి.. ట్విట్టర్ పోస్ట్ ద్వారా, భక్తులకు స్వాగతం పలికారు.. తన ప్రభుత్వం సురక్షితమైన ప్రయాణాన్ని అందజేస్తుందని హామీ ఇచ్చారు. కాగా, 6 నెలల తర్వాత కేదారేశ్వరుని ఆలయాన్ని ఓపెన్‌ చేశారు.. ఈ ఆలయం ఏడాదిలో చాలాకాలం పాటూ మంచుతో కప్పబడి ఉంటుంది కాబట్టి.. ఆ సమయంలో క్షేత్రాన్ని ప్రతీ ఏడాది మూసివేస్తారు. ఇప్పుడు పరిస్థితులు మళ్లీ సాధారణం కావడంతో ఆలయాన్ని తిరిగి ప్రారంభించారు.

అయితే, కోవిడ్-19 మహమ్మారి దృష్ట్యా చార్ ధామ్ యాత్ర 2022 కోసం యాత్రికుల సంఖ్యపై ప్రభుత్వం రోజువారీ పరిమితిని నిర్ణయించిన విషయాన్ని యాత్రికులు గమనించాలి. అధికారులు కేదార్‌నాథ్ ఆలయానికి రోజువారీ పరిమితిని 12,000, బద్రీనాథ్‌కు 15,000గా నిర్ణయించారు.. మరోవైపు, చార్‌ ధామ్‌ యాత్రకు కోవిడ్‌ నెగిటివ్‌ సర్టిఫికెట్‌ లేదా కోవిడ్‌ టీకా సర్టిఫికేట్‌ తప్పనిసరి కాదని తెలిపింది ఉత్తరాఖండ్ ప్రభుత్వం.