NTV Telugu Site icon

Kavitha: ఢిల్లీ హైకోర్టులో చుక్కెదురు.. బెయిల్ పిటిషన్లు తిరస్కరణ

Keke

Keke

ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఢిల్లీ హైకోర్టులో చుక్కెదురైంది. రెగ్యులర్ బెయిల్ పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టేసింది. రెండు వేర్వేరు పిటిషన్లు వేయగా.. రెండింటినీ ధర్మాసనం తిరస్కరించింది. సీబీఐ, ఈడీ నమోదు చేసిన కేసుల్లో బెయిల్‌ మంజూరు చేయాలంటూ కవిత ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు.

ఇది కూడా చదవండి: Monsoon: అలర్ట్.. రేపటి నుంచి ఏపీలోని పలు చోట్ల భారీ వర్షాలు..

లిక్కర్ పాలసీ కేసులో మార్చి 15న ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. అనంతరం ఈడీ కస్టడీకి కోర్టు అనుమతిచ్చింది. అటు తర్వాత న్యాయస్థానం ముందు హాజరుపరచగా జ్యుడీషియల్ కస్టడీ విధించడంతో తీహార్ జైలుకు తరలించారు. అప్పటి నుంచి ఆమె జైల్లోనే ఉంటున్నారు. తాజాగా వేసుకున్న రెండు పిటిషన్లు తిరస్కరణకు గురవ్వడంతో ఆమె తీహార్ జైల్లోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఇది కూడా చదవండి: Pakistan video: పాక్ పార్లమెంట్‌లో నవ్వులు.. మహిళా ఎంపీ-స్పీకర్ మధ్య ఇంట్రెస్టింగ్ సీన్

కవితను నిరాధార ఆరోపణలతో అరెస్టు చేశారని, ఒక పార్టీకి కీలక నేతగా ఉన్నా ఆమెకు ఎలాంటి అవకాశాలు కల్పించకుండా ఉంచారంటూ ఆరోపిస్తూ ఆమె తరఫు న్యాయవాదులు కోర్టులో వాదించారు. ఈడీ, సీబీఐ తరఫున వాదనలు వినిపిస్తూ.. ఢిల్లీ మద్యం కేసులో కవిత కీలక పాత్రధారి, సూత్రధారి అని కోర్టుకు తెలిపారు. ప్రస్తుతం మద్యం కేసు కీలక దశలో కొనసాగుతున్న తరుణంలో ఆమెకు బెయిల్‌ మంజూరు చేస్తే సాక్ష్యాలు తారుమారు చేసే అవకాశం ఉందని వాదించారు. అందువల్ల ఎట్టిపరిస్థితుల్లో ఆమెకు బెయిల్‌ మంజూరు చేయొద్దని కోరారు. సీబీఐ, ఈడీ వాదనల్ని పరిగణనలోకి తీసుకున్న కోర్టు కవిత పిటిషన్లను తిరస్కరిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.

ఇది కూడా చదవండి: RACHARIKAM Movie: ఆర్జీవీ పోరి ఇలా అయ్యిందేంటి..? భయపెడుతున్న అప్సరా రాణి..