NTV Telugu Site icon

Kathua Ambush: కథువా ఉగ్రదాడికి ప్రతీకారం తప్పదు.. పాక్‌కి భారత్ వార్నింగ్..

Kathua Ambush

Kathua Ambush

Kathua Ambush: సోమవారం జరిగిన ఉగ్రదాడిలో ఐదుగురు ఆర్మీ అధికారులు మరణించారు. జమ్మూ లోని కథువా జిల్లాలో ఉగ్రవాదులు నక్కి, ఆర్మీ వాహనంపై దాడికి పాల్పడ్డారు. ఐదుగురు ఆర్మీ జవాన్లు మరణించిన ఘటనకు ప్రతీకారం తప్పకుండా తీర్చుంటామని రక్షణ శాఖ కార్యదర్శి గిరిధర అరమనే ఈ రోజు అన్నారు. కథువా బద్నోటాలో జరిగిన ఉగ్రదాడిలో మరణించిన జవాన్లకు సంతాన్ని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. దేశం ఎల్లప్పుడూ వారి సేవల్ని గుర్తు చేస్తుంటుందని, ఈ దాడి వెనక ఉన్న దుష్టశక్తుల్ని భారత్ ఓడిస్తుందని ఎక్స్ ద్వారా రక్షణ మంత్రిశాఖ ట్వీట్ చేసింది.

Read Also: PM Modi: రష్యా మాకు ‘ఆల్ వెదర్ ఫ్రెండ్’’.. ‘డిస్కో డాన్సర్‌’ గురించి ప్రస్తావన..

కథువాలోని మారుమూల మాచెడి ప్రాంతంలో ఉగ్రవాదులు పెట్రోలింగ్ పార్టీపై మెరుపుదాడి చేయడంతో జూనియర్ కమీషన్డ్ ఆఫీసర్‌తో సహా ఐదుగురు ఆర్మీ సిబ్బంది మరణించారు మరియు చాలా మంది గాయపడ్డారు. ఆర్మీ ట్రక్కులో మొత్తం 10 మంది సైనికులు ఉండగా, ఉగ్రవాదులు గ్రెనేడ్స్ విసిరి, కాల్పులకు పాల్పడ్డారు. దాడి అనంతరం అడవిలోకి పారిపోయారు. ఉగ్రవాదల్ని గుర్తించేందుకు సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు. ఈ దాడికి పాకిస్తాన్‌కి చెందిన జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థకు అనుబంధంగా ఉన్న కాశ్మీర్ టైగర్స్ బాధ్యత వహించింది. గత రెండు వారాల్లో ఆర్మీపై జరిగిన రెండో దాడి.