Jammu Kashmir: CISF క్యాంపులో కలకలం..హెడ్ కానిస్టేబుల్ కాల్పుల్లో నలుగురు జవాన్లు మృతి

  • జమ్మూకశ్మీర్ కథువాలో CISF క్యాంపులో కాల్పులు
  • సేవా పవర్ ప్రాజెక్ట్ వద్ద ఘటన
  • సహచరులపై కాల్పులు జరిపిన హెడ్ కానిస్టేబుల్
  • ఈ ఘటనలో నలుగురు మృతి
Cisf

Cisf

Jammu Kashmir: జమ్మూ కాశ్మీర్ కథువా జిల్లాలోని బసోలిలోని CISF క్యాంపులో సైనికుడు తన తోటి సైనికులపై కాల్పులు జరపడంతో నలుగురు సైనికులు మరణించారు. మంగళవారం జరిగిన ఈ ఘటనకు గల కారణాలు తెలియరాలేదు. దీనిపై ఉన్నతాధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై సీఐఎస్ఎఫ్ ప్రధాన కార్యాలయం విచారణకు ఆదేశించింది. సీఐఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్ ఘటనను పర్యవేక్షిస్తున్నారు.

మంగళవారం సాయంత్రం 7.10 గంటలకు ఈ ఘటన జరిగింది. వెంటనే కథువా జిల్లా పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు.  సేవా పవర్ ప్రాజెక్ట్ వద్ద ఉన్న క్యాంపులో ఈ ఘటన జరిగింది. ఈ ప్రాంతం హిమాచల్ ప్రదేశ్ సరిహద్దుకు సమీపంలో, హిమాచల్‌లోని చంబా జిల్లాకు ఆనుకుని ఉంది.  హెడ్ కానిస్టేబుల్ అవధేష్ కుమార్ సింగ్ తన వద్ద ఉన్న ఏకే-47 రైఫిల్‌తో కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో మృతి చెందిన వారిని అసిస్టెంట్ కమాండెంట్ అంకిత్ కుమార్ పాండే, సబ్-ఇన్‌స్పెక్టర్ లక్ష్మణ్ సింగ్, కానిస్టేబుళ్లు రఫీక్ అహ్మద్, సందీప్ కుమార్గా గుర్తించారు. నలుగురినీ చికిత్స కోసం హిమాచల్ ప్రదేశ్‌లోని NHPC ఆసుపత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ మరణించినట్లు తెలుస్తోంది.