Site icon NTV Telugu

Kashmiri Nurse Murder: కాశ్మీరీ నర్సు హత్య కేసులో ట్విస్ట్.. 35 ఏళ్ల తర్వాత కీలక దర్యాప్తు

Kashmiri Nurse Murder

Kashmiri Nurse Murder

జమ్మూకాశ్మీర్‌లోని 35 ఏళ్ల క్రితం హత్యకు గురైన కాశ్మీరీ పండిట్ సరళా భట్ కేసు‌పై దర్యాప్తు సంస్థ దృష్టిపెట్టింది. మంగళవారం రాష్ట్ర దర్యాప్తు సంస్థ సెంట్రల్ కాశ్మీర్‌లో దాడులు చేపట్టింది. ఎనిమిది ప్రదేశాలను లక్ష్యంగా చేసుకుని అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. 35 ఏళ్ల తర్వాత అతి పెద్ద చర్యగా దీన్ని చెప్పొచ్చు.

ఇది కూడా చదవండి: US: మోడీ మంచి నిర్ణయం తీసుకున్నారు.. అమెరికాకు గుణపాఠం నేర్పారన్న పెంటగాన్ మాజీ అధికారి

ప్రస్తుతం జైలు శిక్ష అనుభవిస్తున్న వేర్పాటువాద నాయకుడు యాసిన్ మాలిక్ ఇల్లు కూడా ఉంది. ప్రస్తుతం మాలిక్ ఇంట్లో అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. సరళా భట్ హత్యకు సంబంధించి గతంలో నిషేధిత జమ్మూ అండ్ కాశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్‌తో సంబంధం ఉన్న అనేక మంది వ్యక్తుల ఇళ్లపై ఏజెన్సీ దాడులు నిర్వహించిందని అధికారులు తెలిపారు.

యాసిన్ మాలిక్ తీహార్ జైలులో జీవిత ఖైదు అనుభవిస్తున్నాడు. ఉగ్ర నిధుల కేసుకు సంబంధించి అతనికి మరణశిక్ష విధించాలని జాతీయ దర్యాప్తు సంస్థ కోరింది. కానీ ఆయనకు జీవతఖైదు విధించబడింది.

సరళా భట్..

సరళా భట్.. కాశ్మీర్ పండిట్ కుటుంబంలో జన్మించింది. వైద్య వృత్తిపై కోరికతో నర్సింగ్ మార్గాన్ని ఎంచుకుంది. శ్రీనగర్‌లోని షేర్-ఎ-కాశ్మీర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో తన వృత్తిని కొనసాగిస్తోంది.

1990, ఏప్రిల్ 14న హాస్టల్ గది నుంచి అపహరణకు గురైంది. జమ్మూకాశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్‌కు చెందిన రాడికల్ జిహాదీలు అపహరించి తీసుకెళ్లిపోయారు. అనంతరం నాలుగు రోజుల పాటు బంధించి సామూహిక అత్యాచారం చేసి చంపేశారు. ఏప్రిల్ 19న శ్రీనగర్‌ డౌన్‌టౌన్‌లో శవమై కనిపించింది. దేహంలో బుల్లెట్ గాయాలు కనిపించాయి. పోలీస్ ఇన్ఫార్మర్ అంటూ చేతిలో చీటి రాసి ఉంది. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఉగ్రవాదుల గురించి సమాచారం అందించిందన్న కోపంతో ఆమెను అత్యంత దారుణంగా చంపేశారు. ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి దర్యాప్తు సంస్థ దృష్టి పెట్టింది.

ఇది కూడా చదవండి: US: ఎయిర్‌పోర్టులో రెండు విమానాలు ఢీ.. భారీగా మంటలు

Exit mobile version