Kashi Cafe Controversy: జిన్నా విగ్రహం, బీఫ్ వ్యాఖ్యలు.. యూట్యూబర్‌పై కేరళ సర్కార్ ఫైర్!
- కేరళలో యూట్యూబర్ వ్యాఖ్యలు కలకలం..
- ఫోర్ట్ కొచ్చి కేఫ్‌లో జిన్నా విగ్రహం ఉందని, బీఫ్ వడ్డిస్తున్నారని పోస్ట్..
- మతవిద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు ఉన్నాయని కేసు నమోదు..
- ఇలాంటి వ్యాఖ్యలు ఆమోదయోగ్యం కాదని సీఎం స్పందన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kashi Cafe Controversy: కేరళలోని పోర్ట్ కొచ్చిలో ఉన్న కాశీ ఆర్ట్ కేఫ్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై యూట్యూబర్ అమృత్ సింగ్ డారెన్‌పై అక్కడి పోలీసులు కేసు నమోదు చేశారు. మతపరమైన వర్గాల మధ్య విద్వేశాలు రెచ్చొట్టేలా వ్యాఖ్యలు చేశారని ఫోర్ట్ కొచ్చి పోలీసులు భారతీయ న్యాయ సంహిత (BNS)లోని సెక్షన్లు 353(2), 192 కింద కేసు నమోదు చేశారు.
నార్త్ ఇండియాకు చెందిన డారెన్ ఇన్‌స్టాగ్రామ్‌లో.. కేఫ్‌లో మహాత్మాగాంధీ విగ్రహం పక్కన మహ్మద్ అలీ జిన్నా విగ్రహం ఉందని, అక్కడ బీఫ్ వడ్డిస్తున్నారని ఆరోపించారు. ఈ వ్యాఖ్యలు ప్రజాశాంతికి విఘాతం కలిగించి, రెండు వర్గాల మధ్య ఘర్షణలకు దారి తీయవచ్చని కేసు నమోదైంది. సోషల్ మీడియాలో ఈ వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. డారెన్‌కు మద్దతుగా, వ్యతిరేకంగా అనేక అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కేరళకు చెందిన పలువురు ఈ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read
- Cyclone Alert: బంగాళాఖాతంలో తుఫాను ముప్పు.. ఏపీ, ఒడిశాకు ఎల్లో అలర్ట్
- Rahul Gandhi: రాహుల్ గాంధీ భవితవ్యం.. రేపు ‘‘పరువు నష్టం’’ కేసులో కోర్టు తీర్పు..
- Mann Ki Baat: ‘వోకల్ ఫర్ లోకల్’తో ప్రపంచ మార్కెట్లలోకి భారత ఉత్పత్తులు!.. మన్ కీ బాత్‌లో ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు
- Dhanush Political Entry: చెన్నై వేదికగా ధనుష్ గ్రాండ్ ఈవెంట్.. 58 జిల్లాల నుంచి మహిళా ప్రతినిధులు
అయితే, గాంధీ–జిన్నా విగ్రహాల ప్రస్తావనకు సంబంధించిన కళాకృతి కొత్తగా ఏర్పాటు చేసింది కాదు. ప్రముఖ కళాకారుడు రియాస్ కోము రూపొందించిన ఈ ఇన్‌స్టాలేషన్‌ను కొన్నేళ్ల క్రితమే ఏర్పాటు చేశారు. గుజరాత్‌కు చెందిన ఇద్దరు నాయకుల జీవితాలు, విదేశీ పాలనకు వ్యతిరేకంగా వారి పోరాటం, అనంతరం జరిగిన దేశ విభజన వంటి అంశాలను ఈ కళాకృతి ప్రతిబింబిస్తుంది.
ఇప్పుడు ఈ వివాదంలోకి కేరళ ప్రభుత్వం కూడా ఎంట్రీ ఇచ్చింది. సీఎం వీడీ సతీషణ్ ఈ వీడియోను తీవ్రంగా విమర్శించారు. రాష్ట్రంలో మత విద్వేషాలకు చోటులేని, తప్పుడు సమాచారంతో సమాజాన్ని విభజించే ప్రయత్నాలనున సహించబోమని ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఫోర్ట్ కొచ్చి గురించి తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తూ రాష్ట్రాన్ని అబాసుపాలు చేయడం ఆమోదయోగ్యం కాదని అన్నారు. ఈ ఘటనపై కేసు నమోదైందని, చట్టప్రకారం చర్యలు కొనసాగుతాయని ఆయన స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Kashi Cafe Controversy: జిన్నా విగ్రహం, బీఫ్ వ్యాఖ్యలు.. యూట్యూబర్‌పై కేరళ సర్కార్ ఫైర్!
-
Cyclone Alert: బంగాళాఖాతంలో తుఫాను ముప్పు.. ఏపీ, ఒడిశాకు ఎల్లో అలర్ట్
-
MS Dhoni: “డాక్టర్లపైనే నమ్మకం ఉంచా.. త్వరలోనే నిర్ణయం ప్రకటిస్తా”.. రిటైర్మెంట్పై ధోనీ సంచలన ప్రకటన
-
Rahul Gandhi: రాహుల్ గాంధీ భవితవ్యం.. రేపు ‘‘పరువు నష్టం’’ కేసులో కోర్టు తీర్పు..
-
Nothing Phone (5) Pro: నథింగ్ Phone (5) Pro, Phone (5) ఫస్ట్ లుక్.. 144Hz డిస్ప్లే, 8K వీడియో, భారీ బ్యాటరీ?
ట్రెండింగ్
-
Humanoid Robot : కత్తి దాడినే అడ్డుకుంది.. చైనా రోబో విన్యాసాలు చూస్తే మైండ్ బ్లాక్
-
Incredible India : ప్రపంచ రికార్డుల ఖజానా.. భారత్‌లో ఈ ప్రదేశాలు చూశారా.?
-
Spine Health : చిన్న అలవాట్లే వెన్నెముకకు ముప్పు.. మీ పొజిషన్స్ సరిగ్గా లేకపోతే ఇబ్బందే
-
Bottle Gourd Roti Recipe: సొరకాయతో టేస్టీ రోటీలు.. బ్రేక్‌ఫాస్ట్‌కు అదిరిపోయే హెల్తీ రెసిపీ..
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!