Site icon NTV Telugu

Nityananda Olakadu: రోడ్ల దుస్థితిపై నిరసన.. నిత్యానంద పొర్లు దండాలు..!

Nityananda Olakadu

Nityananda Olakadu

నిత్యానంద అనగానే వెంటనే వివాదాస్పద నిత్యానంద స్వామీజీ గుర్తుకు వచ్చాడేమో.. విషయం అది కాదు ఇక్కడ… ఇటీవల కురిసిన వర్షాలతో ఎక్కడ చూసినా రోడ్లు గుంతలమయం అయ్యాయి.. రోడ్డు ఎక్కామంటే ఇంటికి జాగ్రత్తగా చేరుతామనే గ్యారంటీ లేని పరిస్థితి ఏర్పడింది.. అయితే, కర్ణాటకలో రోడ్ల దుస్థితిపై వినూత్న తరహాలో నిరసనకు దిగారు నిత్యానంద అనే సామాజిక కార్యకర్త.. ఉడిపిలో రోడ్లపై ఉన్న గుంతలను నిరసిస్తూ కర్ణాటకకు చెందిన నిత్యానంద ఒలకడు అనే సామాజిక కార్యకర్త నిరసన చేపట్టారు.. ఉడిపిలో రోడ్లను బాగు చేయాలని డిమాండ్ చేస్తూ ‘ఉరులు సేవ’ పేరుతో రోడ్డుపై పొర్లుతూ నిరసన వ్యక్తం చేశారు..

Read Also: Hyderabad Crime: ఓల్డ్‌ సిటీలో దారుణం.. బాలిక కిడ్నాప్‌, లాడ్జిలో నిర్బంధించి లైంగికదాడి..

అయితే, ‘ఉరులు సేవ’ అనేది సాధారణంగా దేవాలయాలలో నిర్వహించబడే ఒక ఆచారం మరియు సమాజ శ్రేయస్సు కోసం నేలపై పొర్లుతూ చేస్తుంటారు.. కానీ, రోడ్డుపై ఉన్న గుంతల విషయంలో ఆందోళనకు దిగిన నిత్యానం.. కొబ్బరికాయ కొట్టి, హారతి ఇచ్చి నిరసన చేప్టటారు.. ఇది చూసిన స్థానిక జనం అక్కడ గుమికూడారు. పోలీసులు సైతం అక్కడికి చేరుకొని అతన్ని అక్కడ్నుంచే తరలించే ప్రయత్నం చేశారు. అయితే కొత్త రోడ్లు వేసేందుకు టెండర్లు వేసి మూడేండ్లు గడుస్తున్నా పనులు ఇంకా చేపట్టలేదని ఆరోపించారు నిత్యానంద.. గతుకుల రోడ్డుపై ప్రయాణం చేస్తున్న ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.. ఎవరూ ఈ సమస్యను లేవనెత్తడం లేదు. ప్రతిరోజు వేలాది మంది ఈ రహదారిని వినియోగిస్తున్నారు.. ముఖ్యమంత్రి కూడా ఈ బాటలో వెళ్లారు.. కానీ, పట్టించుకోలేదని.. రోడ్డు మరమ్మతుల కోసం ప్రధాని నరేంద్ర మోడీ గానీ, కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ గానీ ఇక్కడికి రావాలంటూ వ్యాఖ్యానించారు. మొత్తంగా రోడ్ల దుస్థితిపై నిత్యానంద పొర్లు దండాలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిపోయాయి..

Exit mobile version