Karnataka: కర్ణాటక రాష్ట్రంలోని శివమొగ్గ, విజయపుర జిల్లాల్లో ఈద్ మిలాద్ ప్రదర్శనల సందర్భంగా వివాదాస్పద ఘటనలు చోటు చేసుకున్నాయి. సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోలు, ఆడియో క్లిప్‌లు ప్రస్తుతం తీవ్ర కలకలం రేపుతుంది. ఈ నేపథ్యంలో పోలీసులు కేసులు నమోదు చేసి విచారణ కొనసాగిస్తున్నారు. కాగా, శివమొగ్గ జిల్లా భద్రావతిలోని గాంధీ సర్కిల్ సమీపంలోని తారికెరే రోడ్ దగ్గర సోమవారం రాత్రి 8 గంటల సమయంలో జరిగిన ప్రదర్శనలో కొందరు యువకులు “పాకిస్తాన్ జిందాబాద్” అంటూ నినాదాలు చేసినట్లు 12 సెకన్ల వీడియోలో కనిపిస్తోంది. అలాగే, డీజే మ్యూజిక్‌కు డ్యాన్స్ చేస్తూ ఉన్నప్పుడు ఈ నినాదాలు వినిపించాయి.
Read Also: Theft: సెల్ ఫోన్ కొట్టేసి.. రూ. 6 లక్షలు విత్ డ్రా చేసిన దొంగ.. ఎలా అంటే?
అలాగే, ఈ వీడియోపై స్పందించిన శివమొగ్గ జిల్లా ఎస్పీ మాట్లాడుతూ.. భద్రావతిలో నిన్న జరిగిన ఈద్ మిలాద్ ర్యాలీలో పాకిస్తాన్ అనుకూల నినాదాలు చేశారని ఒక వీడియో వైరల్ అవుతోంది.. ఈ వివాదంపై మేము ఎఫ్ఐఆర్ నమోదు చేశాం.. ఆ వీడియో ఎప్పుడు తీశారు, ఎక్కడ తీశారు, ఎవరెవరు నినాదాలు చేశారు.. ఈ వీడియో నిజమైనదా కాదా అనే కోణంలో మేము దర్యాప్తును కొనసాగిస్తామని ఎస్పీ వెల్లడించారు.
Read Also: Vice President Election: ఉప రాష్ట్రపతి ఎన్నికలో ఓటేసిన సోనియా, ప్రియాంక
మరోవైపు, విజయపురలో జరిగిన ఈద్ మిలాద్ వేడుకల సందర్భంగా మరో వివాదం చెలరేగింది. డీజే వాహనంలో రెచ్చగొట్టే ఆడియో ప్లే చేసిన సంఘటన వెలుగులోకి వచ్చింది. ఆ ఆడియోలో “పోలీసులు 15 నిమిషాలు పక్కన నిలబడితే, ఎవరి దమ్ము ఎంతో తెలిపిపోతుంది.. మేము హిందూస్థాన్‌ను ఎలా కడగగలమో అలా చేసి చూపిస్తాము” అనే మాటలు వినిపించాయి. ఈ సంఘటనలో ముగ్గురు వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చేశారు. వారిలో డీజే వాహన యజమాని (A1), డీజే ఆపరేటర్ (A2), అలాగే ‘MT Touseef15s’ ఇన్‌స్టాగ్రామ్ ఐడీ యూజర్ ని అదుపులోకి తీసుకున్నారు.
Pro-pakistan Slogan | ಭದ್ರಾವತಿಯಲ್ಲಿ ಪಾಕ್ ಪರ ಘೋಷಣೆ ಕೂಗಿ ಪುಂಡಾಟ | Bhadravati | Shivamogga
.
.
.
.
.#ganeshaprocession #ganesha #shivamogga #muslim #hindumuslim #hindu #Bhadravathi #PakistanZindabadslogan pic.twitter.com/EmQzTJauer— Sanjevani News (@sanjevaniNews) September 9, 2025
