NTV Telugu Site icon

Karnataka: సిద్ధరామయ్య సర్కార్ సంచలన నిర్ణయం.. ఎస్‌బీఐ, పీఎన్‌బీ లావాదేవీలు నిలిపివేత

Siddaramaiah

Siddaramaiah

కర్ణాటకలో సిద్ధరామయ్య ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI), పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB)తో అన్ని లావాదేవీలను నిలిపివేస్తూ కర్ణాటక ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ బ్యాంకుల్లో తమ ఖాతాలను మూసివేసి.. డిపాజిట్లను వెంటనే రికవరీ చేయాలని అన్ని శాఖలకు ఆదేశించింది. బ్యాంకుల్లో డిపాజిట్ చేసిన ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేశారన్న ఆరోపణల నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఆదేశాలు జారీ చేసింది.

ఇది కూడా చదవండి: Bihar: బీహార్‌లో దారుణం.. ఐదుగురు కుటుంబ సభ్యులు హత్య

బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లలో ఆర్థిక అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ తమ ఖాతాలను మూసివేయాలని కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం బుధవారం అన్ని శాఖలను ఆదేశించింది. అన్ని రాష్ట్ర ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వ సంస్థలు, కార్పొరేషన్లు, బోర్డులు, స్థానిక సంస్థలు, విశ్వవిద్యాలయాలు మరియు ఇతర సంస్థలు ఈ బ్యాంకుల నుంచి తమ డిపాజిట్లు మరియు పెట్టుబడులను వెంటనే ఉపసంహరించుకోవాలని రాష్ట్ర ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్‌లోని ఐటీ కంపెనీలు, సహకార బ్యాంకు ఖాతాల్లోకి రూ.88.62 కోట్లను బదిలీ చేయడంతో కార్పొరేషన్ నిధుల్లో రూ.187 కోట్లకు సంబంధించిన అనధికార లావాదేవీలు జరిగినట్లుగా ఉత్తర్వుల్లో పేర్కొంది.

ఇది కూడా చదవండి: Delhi Fire Accident: ఢిల్లీలో ఫైర్ యాక్సిడెంట్.. మంటలార్పేందుకు వచ్చిన సిబ్బందికి ప్రమాదం

Show comments