Karnataka: కర్ణాటక ప్రభుత్వం మద్యం ధరల్ని పెంచాలని యోచిస్తోంది. ముఖ్యంగా బీరు ధరల్ని పెంచుతారనే ప్రచారం జరుగుతోంది. ఇటీవల బస్సు ఛార్జీలు, నీటి ఛార్జీలు, మెట్రో ఛార్జీలు పెంచుతారనే వార్తల నేపథ్యంలో ఇప్పుడు బీరు ధరల పెరుగుదల అనేది హాట్ టాపిక్‌గా మారింది. ఈ నిర్ణయంపై మందుబాబులు ఆందోళనతో ఉన్నారు. అయితే, బీరు ధరల పెంపుపై చర్చలు జరుగుతున్నాయని, ఇంకా ఖచ్చితమైన నిర్ణయం తీసుకోలేదని ఎక్సైజ్ మంత్రి ఆర్బీ తిమ్మాపూర్ గురువారం వెల్లడించారు.
Read Also: RBI: ఖాతాదారులకు RBI గుడ్ న్యూస్.. ఇకపై బ్యాంకులు మీకు రోజుకు రూ. 100 చెల్లింపు!
“మేము ప్రస్తుతానికి బీరు తప్ప మద్యం ధరలను పెంచే ఆలోచనలో లేము. మేము బీరు ధరల పెంపును పరిశీలిస్తున్నాము. అయితే, నిర్ణయాన్ని ఖరారు చేయడానికి మేము ఇంకా ముఖ్యమంత్రితో చర్చించలేదు, ”అని తిమ్మాపూర్ అన్నారు. ఈ నిర్ణయం ఇంకా ప్రాథమిక దశలోనే ఉందని మంత్రి చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం జూలై 2023 రాష్ట్ర బడ్జెట్‌లో ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్ (IMFL) పై ఎక్సైజ్ సుంకాన్ని 20 శాతం పెంచుతూ, బీరు ధరలను 10 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 2024లో స్ట్రాంగ్ బీర్‌లపై అధిక ఎక్సైజ్ సుంకం విధించాలని భావించింది. ఒక వేళ తాజా బీర్ల ధరల పెంపుకు ప్రభుత్వం ఆమోదం తెలిపిదే, సంవత్సరం వ్యవధిలో బీర్ల ధరలు పెరగడం ఇది మూడోసారి అవుతుంది.