NTV Telugu Site icon

Minister Shivanand Patil: రైతులపై మంత్రి వివాదస్పద వ్యాఖ్యలు.. ‘పరిహారం కోసమే ఆత్మహత్యలు..!’

Shivanand Patil

Shivanand Patil

కర్ణాటక మంత్రి శివనంద్ పాటిల్ రైతులపై వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. పరిహారం కోసమే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారంటూ చేసిన ఆయన కామెంట్స్ ప్రస్తుతం తీవ్ర దూమారం రేపుతున్నాయి. రైతుల ఆత్మహత్యలను అవహేళన చేసిన మంత్రిపై ప్రజలు, ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. దీంతో ఆయనను కేబినెట్‌ నుంచి తొలగించాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొన్న శివానంద్ పాటిల్ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రభుత్వం చనిపోయిన రైతుల కుటుంబాలకు ఇచ్చే పరిహారాన్ని పెంచినప్పటి నుంచి రైతుల ఆత్మహత్యల సంఖ్య కూడా పెరిగిందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Also Read: Delhi Tour: రేపు ఢిల్లీకి రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క

అంతేకాదు ‘ఇప్పడు రైతులంతా కరువు రావాలని కోరుకుంటున్నారు. ఎందుకంటే అలా కరవు వస్తే, తాము తీసుకున్న రుణాలు మాఫీ అవుతాయనేది వారి ఆశ. రైతులకు నీళ్ళు ఉచితం. కరెంటు ఉచితం. విత్తనాలు, ఎరువులు ఉచితం. కాబట్టి తమ రుణాలు రద్దు కావాలంటే ప్రతి ఏటా కరవు రావాలని రైతులు కోరుకుంటున్నారు’ అంటూ మాట్లాడుకొచ్చారు. దీంతో ఆయన వ్యాఖ్యలపై రైతు సంఘాలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నాయి. ఇలాంటి ప్రకటన చేసిన మంత్రి తన పదవికి రాజీనామా చేయాలని కర్ణాటక రాష్ట్ర రైతు సంఘం అధికారి మల్లికార్జున్ బళ్లారి డిమాండ్ చేశారు. ‘‘మీ కుటుంబానికి రూ.50 లక్షలు పరిహారం ఇస్తే ఆత్మహత్య చేసుకుంటావా?’’ అంటూ ధ్వజమెత్తారు.

Also Read: Uddhav Thackeray: ఈ సారి ఆ తప్పు చేస్తే దేశంలో నియంతృత్వమే.. ఉద్ధవ్ సంచలన వ్యాఖ్యలు..

ఆయనను వెంటనే మంత్రివర్గం నుంచి తప్పించాలని రైతు సంఘాలు ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు విజ్ఞప్తి చేశాయి. మరోవైపు సిద్దరామయ్య ప్రభుత్వం రైతులను అవమానించేవిధంగా వ్యవహరిస్తోందని బిజేపీ ధ్వజమెత్తింది. సిద్దరామయ్య మంత్రివర్గంలో మూర్ఖులే ఎక్కువమంది ఉన్నారంటూ విమర్శలు గుప్పిస్తోంది. దీంతో తనపై వస్తోన్న వ్యతిరేకతపై మంత్రి స్పందించారు. ఈ మేరకు ఆయన వివరణ ఇచ్చుకున్నారు. రైతుల మనోభావాలను దెబ్బతీయాలని తాను అనుకోలేదని, అయితే రైతుల ఆత్మహత్యలపై నివేదించే ముందు ఎఫ్‌ఎస్‌ఎల్ నివేదిక కోసం వేచి ఉండాలని, మరింత బాధ్యతగా వ్యవహరించాలని మీడియా ప్రజలకు తాను సలహా ఇస్తున్నట్లు చెప్పారు.

Show comments