Panipuri: ఆహార నాణ్యత విషయంలో కర్ణాటక సర్కార్ నిక్కచ్చిగా వ్యవహరిస్తోంది. క్యాబేజీ మంచూరియాలో కృత్రిమ రంగులు, రసాయనాలు వాడటాన్ని ఇప్పటికే నిషేధించింది. తాజాగా చాలా మంది ఫేవరెట్ అయిన ‘‘పానీపూరీ’’ని నిషేధించే దిశగా కర్ణాటక వెళ్తోంది. ఆహార భద్తరా విభాగం బహిరంగ ప్రదేశాలు, మాల్స్‌లో ర్యాపిడ్ టెస్టింగ్ కిట్స్‌ని అందుబాటులోకి తెచ్చింది. నాణ్యత లేని ఆహార పదార్థాలను గుర్తించేందుకు తనిఖీలను ముమ్మరం చేసింది. పానీపూరి నాణ్యతపై పదేపదే ఫిర్యాదులు రావడంతో ఈ చర్యలు తీసుకుంది.
Read Also: Israel-Hamas War: నస్రల్లా వారసుడు వచ్చేశాడు.. హిజ్బుల్లా చీఫ్‌గా నయీం ఖాసిమ్ ఎన్నిక
బెంగళూర్ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో విక్రయిస్తున్న పానీపూరీ నమూనాలను సేకరించి పరీక్షిస్తున్నారు. బెంగళూర్ సహా కర్ణాటక వ్యాప్తంగా 200కి పైగా నమూనాలను సేకరించి పరీక్షలకు పంపారు. పానీపూరిలో వాడే పూరీని ఎలా తయారు చేస్తారు. ఏయే పదార్థాలు కలుపుతున్నారు..? వీటితో ప్రజల ఆరోగ్యంపై ప్రభావం ఎంత..? అనే వివరాలను ఆహారశాఖ పరిశీలిస్తోంది. గత రెండు రోజులుగా పానీపూరీ తయారీదారులపై దాడులు నిర్వహిస్తోంది. నివేదిక వచ్చిన తర్వాత దీనిని నిషేధించాలా..? వద్దా.?? అనేది నిర్ణయించబడుతుంది. రుచిని పెంచడానికి యూరియా, హార్పిక్ వంటి ప్రమాదకరమైన పదార్థాలను వాడుతున్నారనే ఆరోపణలు రావడంతో కర్ణాటక ప్రభుత్వం నిఘాని పెంచింది.